Begin typing your search above and press return to search.
టాప్ సీక్రెట్ : పాపం ముఖేష్ గౌడ్.. ఎవ్వరికి పట్టని నేత
By: Tupaki Desk | 18 July 2019 6:19 AM GMTబెల్లం చుట్టే ఈగలు.. అధికారం చుట్టే నేతలు తిరుగుతున్న కాలం ఇదీ.. పట్టుమని నెలరోజులు కూడా కాకముందే టీడీపీ అధికారం కోల్పోయిందని బీజేపీలో చేరిన ఎంపీలున్న సమాజం మనది.. అధికారమే శ్వాసగా భావిస్తున్న రాజకీయాల్లో ఓడిపోయిన నేతల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలియజేసే సంఘటన ఒకటి ప్రస్తుతం చోటుచేసుకుంది..
ముఖేష్ గౌడ్.. హైదరాబాదీలకు బాగా పరిచయమున్న నేత. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కేబినెట్ లో ఈయనకు చోటు కల్పించడంతో రాష్ట్రమంతా తెలిసింది. నాడు కాంగ్రెస్ లో ఉన్న దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ లను హైదరాబాద్ బ్రదర్స్ గా పిలుస్తుంటారు. ఇద్దరు మంత్రులుగా కొనసాగిన వారే..
అయితే రాజకీయంగా ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ నే నమ్ముకొని కొనసాగారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో పోటీచేసి ఓడిపోయారు. ఇక 2019లో కూడా గోషామహల్ నుంచి పోటీచేసి ఓడారు. అప్పుడే ఆయనకు క్యాన్సర్ వ్యాధి అటాక్ అయ్యింది. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటేనే అంబులెన్స్ లో వచ్చి ఓటేశారు.
ఏడు ఎనిమిది నెలలుగా క్యాన్సర్ తో చికిత్స తీసుకుంటున్న ఈ కాంగ్రెస్ సీనియర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందట. చికిత్సకు ఈయన శరీరం సహకరించక పోవడంతో వైద్యులు చికిత్స నిలిపివేశారట .. విషమంగా ఉన్న ఈ కాంగ్రెస్ ఉద్దండున్ని కాంగ్రెస్ పట్టించుకున్న పాపాన పోకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
మంత్రిగా ముఖేష్ గౌడ్ ఉన్నప్పుడు ఈయన వెంట ఉన్న నేతలు, ఈయనతో పనులు చేయించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్లు కూడా ముఖేష్ ను కనీసం చూడడానికి కూడా రాకపోవడంపై ముఖేష్ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే సీనియర్ కూడా ముఖేష్ ను పరామర్శించిన పాపాన పోలేదని వాపోతున్నారు. రాజకీయాల్లో కృతజ్ఞత అనేదే లేదని కలత చెందుతున్నారు. మైకుల ముందు ఊదరగొట్టే టీ కాంగ్రెస్ నేతలు ఇలా తమ తోటి నేత కష్టాల్లో ఉన్నా కనీసం చూడకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.