Begin typing your search above and press return to search.
రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ .. ఏంచేశాడంటే ?
By: Tupaki Desk | 5 Aug 2021 8:32 AM GMTనేషనల్ కాంగ్రెస్ కీలక నేత అయిన రాహుల్ గాంధీ పై ఢిల్లీ లో పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేసేలా రాహుల్ గాంధీ ఏం చేసాడు అని ఆలోచిస్తున్నారా? ఢిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల బాలిక తల్లితండ్రులతో తాను ఉన్న ఫోటోను షేర్ చేయడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై న్యాయవాది వినీత్ జిందాల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ చర్య పోక్సో చట్టం సెక్షన్ 23 కింద నేరమని, ఐపీసీ 228ఏ ఉల్లంఘన కిందకు వస్తుందని ఢిల్లీకి చెందిన న్యాయవాది జిందాల్ తన ఫిర్యాదులో పొందుపరిచారు. జిందాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు రాహుల్ గాంధీ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.
ఢిల్లీ హత్యాచార ఘటనలో బాధితురాలి కుటుంబ సభ్యులను బుధవారం ఉదయం రాహుల్ వారి ఇంటికెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలుస్తానని చెప్పారు. అయితే , అత్యాచారం, హత్యకు గురైన 9 ఏళ్ల చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఫోటోలను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారుతోంది. హత్యాచార ఘటనలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల వివరాలను రాహుల్ గాంధీ బహిర్గతం చేయడం సరికాదని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మండిపడ్డారు. పోస్కో యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ లోని పలు సెక్షన్లను రాహుల్ ఉల్లంఘించారని ఆరోపణలు చేసారు. రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ను డిమాండ్ చేశారు.
పోస్కో చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరూ వీఐపీ కాదన్నారు. తాను చేసిన తప్పుకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. తప్పు చేస్తున్నట్లు తెలిసి కూడా బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలను రాజకీయ స్వార్థంతోనే రాహుల్ ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేశారని ఆరోపణలు చేశారు. ఢిల్లీ హత్యాచార ఘటనను తన రాజకీయ అజెండా కోసం వాడుకోవాలని రాహుల్ గాంధీ చూస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లో కూడా రేప్ బాధితురాళ్లు ఉన్నారని, మరి ఆ కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన ఆ రాష్ట్రాలకు ఎందుకు వెళ్లరని పాత్ర ప్రశ్నించారు. ఇదిలా ఉంటే .. హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యుల ఫోటోలను రాహుల్ గాంధీ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను బహిర్గతం చేయడం ద్వారా రాహుల్ గాంధీ పోస్కో యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపించింది. ఈ వ్యవహారంలో ట్విట్టర్ కు కూడా నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగానూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.