Begin typing your search above and press return to search.

ర‌మ్యా... కోరి త‌ల గోక్కున్నారే!

By:  Tupaki Desk   |   23 Aug 2017 9:02 AM GMT
ర‌మ్యా... కోరి త‌ల గోక్కున్నారే!
X
కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్ గా పేరుప‌డ్డ‌ సినీ నటి రమ్యపై మరోసారి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపే సంపాదించుకున్న ర‌మ్య‌... ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర‌య్యారు. అధిష్ఠానం పెద్ద‌ల‌తో కాస్తంత ప‌రిచ‌యాలు పెంచుకున్న ర‌మ్య‌... క‌న్న‌డ‌నాట కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కీల‌క నేత‌గానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సినిమాల‌ను వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత అక్క‌డ కూడా త‌న‌దైన శైలి గుర్తింపు తెచ్చుకోవాల‌నేది ఆమె భావ‌న‌గా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్పటికే ఎన్నోసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమ్య మరోసారి తాను చేసిన విమ‌ర్శ‌లు తిరిగి త‌న‌కే తాక‌టంతో షాక్ తిన్నారు.

సోషల్ మీడియాలో య‌మా యాక్టివ్‌ గా ఉండే ర‌మ్య‌... గ‌తంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసిన వ్యాఖ్య‌లు అటు తిరిగి ఇటు తిరిగి మ‌ళ్లీ ఆమెనే తాకాయి. అయితే ఆ గుణ‌పాఠాలు చాల‌వ‌న్న‌ట్లు ఇప్పుడు అటే ట్విట్ట‌ర్ వేదికగా రంగ‌లోకి దిగిన ర‌మ్య‌... ఇప్పుడు నేరుగా ప్రధానినే టార్గెట్‌ చేశారు. గుజరాత్ - అసోం - బిహార్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ప్రధాని న‌రేంద్ర మోదీ పరామ‌ర్శించిన పాపాన పోలేద‌ని ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేసిన ర‌మ్య‌... ఒక వేళ మోదీ అక్క‌డ ప‌ర్య‌టించార‌ని మీ వ‌ద్ద ఏమైనా ప్రూఫ్ లు ఉంటే పంపించాల‌ని నెటిజ‌న్ల‌ను అభ్య‌ర్థించింది. ఇలా వ‌ర‌ద ప్రాంతాల్లో మోదీ ప‌ర్య‌టించిన‌ట్లు ఆధారాలను గానీ, ఫొటోల‌ను గానీ పోస్ట్ చేసిన వ్య‌క్తుల‌కు తాను రూ.25 వేల‌ను ఇస్తానని ప్రకటించారు. త‌న స‌వాల్‌ కు జ‌నం బాగానే స్పందిస్తార‌ని అనుకుంటే... నెటిజ‌న్లు మాత్రం రివ‌ర్స్ గేర్‌ లో ర‌మ్య‌నే తిట్టిపోస్తూ కామెంట్లు చేశారు.

ఇప్పుడు ఈ అంశం వైర‌ల్‌ గా మారిపోయింది. కాంగ్రెస్ శవ రాజకీయాలకు ఈ త‌ర‌హా స‌వాళ్లు - ప్ర‌క‌ట‌న‌లు నిర్శ‌న‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో పాటు ఈ త‌ర‌హా ప్ర‌చారాన్ని ఆపాలని కోరారు. అయితే మ‌రి కొందరు వ‌ర‌ద ప్రాంతాల్లో మోదీ పర్యటించిన ఫొటోల‌ను ఏకంగా ట్విట్ట‌ర్‌ లోనే షేర్ చేశారు. ఓ నెటిజన్‌ తన బ్యాంకు అకౌంట్‌ వివరాలు ఎవరికి పంపాలని కోరాడు. నెటిజన్ల స్పందనతో షాకైన రమ్య... వారి కామెంట్లను బ్లాక్ చేశారు. కాంగ్రెస్‌ లాగే ఆమె కూడా ఇచ్చిన మాట తప్పారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల రమ్యను కర్ణాటక కాంగ్రెస్ సోషల్‌ మీడియా విభాగం అధ్యక్షురాలిగా నియమించారు. అయితే ఆమె ప్రచారం పార్టీకి మేలు కంటే కీడే ఎక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు.