Begin typing your search above and press return to search.
కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ నేత వ్యాఖ్యల కలకలం..
By: Tupaki Desk | 17 Dec 2021 1:03 PM ISTఒక రాష్ట్రానికి చెందిన స్థితిగతుల మార్పునకు అసెంబ్లీ వేదిక అవుతుంది. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించబడుతుంది. ఇలాంటి సమయంలో అసెంబ్లీ సభ్యులు గౌరవంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసెంబ్లీలో జరిగే సన్నివేశాలు కోట్లాది మంది రాష్ట్రప్రజలు వీక్షిస్తుంటారు.
ఇలాంటి సందర్భంగా ఇక్కడ ప్రసంగించేవారు జాగ్రత్తగా ఉండకపోతే ఆ ప్రభావం రాష్ట్రంపై పడే అవకాశం ఉంది. చట్ట సభల్లో సభ్యుల తీరు సరిగా లేదని కొన్ని రోజులగా అన్నివైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో కర్ణాటక అసెంబ్లీలో ఓ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
అత్యాచార ఘటనలెన్నో అసెంబ్లీ వేదికగా చర్చించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ‘నిర్భయ’ ఘటన తరువాత ప్రత్యేక చట్టాన్ని కూడా రూపొందించారు.
అయితే అత్యాచారాలు ఇంకా ఆగకపోవడం ఆందోళనకరం. అయితే బయట పరిస్థితులను పక్కనబెడితే అసెంబ్లీ వేదికగా ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహారించాలని ఇప్పటికే పలు సందర్భాల్లో నేతలు సూచిస్తున్నారు. కానీ కొందరు నాయకుల తీరు మాత్రం మారడం లేదు. సాక్షాత్తూ అసెంబ్లీ స్సీకర్ గా పనిచేసిన ఓ నేత అత్యాచారం విషయంలో వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మాజీ స్పీకర్ ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో తనకు అవకాశం వచ్చిన తరువాత నోరు జారారు. రైతుల సమస్యలపై స్పీకర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు పడుకొని ఎంజాయ్ చేయాలి’..అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అక్కడున్న సభ్యులంతా పగలబడి నవ్వారు.కానీ.. ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు.
అయితే కాంగ్రెస్ నేత రమేశ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. దేవాలయంలా భావించే అసెంబ్లీలో సభ్యులు ఇలా నీచంగా మాట్లాడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థితిగతలును మార్చే అసెంబ్లీని ఇలాంటి నేతలు భ్రష్టు పట్టిస్తున్నారని అంటున్నారు. గౌరవ ప్రదమైన పదవిలో ఉన్నవారు ఇలా మాట్లాడితే.. రాను రాను నేతలపై నమ్మకం పోతుందని అంటున్నారు.
మరోవైపు విమర్శలు అనేకంగా వస్తున్నా కాంగ్రెస్ నేత ఏ విధంగానూ స్పందించలేదు. కోట్లాది మంది వీక్షించే అసెంబ్లీ సమావేశాలను ఇలా సామెతలతోనే కాలం గడుపుతూ పరువు తీస్తున్నారని అంటున్నారు.
అయితే ఇలాంటి సందర్భం లేని వ్యాఖ్యలు చాలా మంది అసెంబ్లీలో చేశారు. కానీ తాము చేసిన తప్పును ఒప్పుకొని ఆ తరువాత క్షమాపణ చెప్పారు.కానీ రమేశ్ కుమార్ మాత్ర స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ జరిగిన పరిణమాలు ప్రజల్లో ప్రభావం చూపుతుందని అంటున్నారు.
అయితే కాంగ్రెస్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖండించకపోగా.. సభలోని వారందరూ నవ్వుతూ కనిపించారు. దీంతో సభా సభ్యులందరిపై ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి నేతల వల్లే దేశం భ్రష్టు పట్టిపోతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే వ్యాఖ్యలపై సదరు స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని చర్చించుకుంటున్నారు.
మాజీ స్పీకర్ అయిన రమేశ్ ప్రస్తుత స్పీకర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళనగా మారిందని స్థానిక ప్రజలు అంటున్నారు. సభా మర్యాదలను ఏమాత్రం కాపాడకుండా ఇలా అగౌరవపర్చడంపై రాజకీయ విశ్లేషకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.