Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఈ లేడీ శివ
By: Tupaki Desk | 22 Feb 2018 10:47 AM GMTఫైర్ బ్రాండ్ - కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి తాను చదవిన కాలేజీ రోజులన్ని గుర్తు చేసుకున్నారు. ఓ వెబ్ మీడియా ఛానల్ ల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చైన్ తో ఆకతాయిల్ని చితక బాదిన సంఘటనల్ని గుర్తు చేసుకున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో లేడీ ఫైర్ బ్రాండ్ గా మొదట పేరు గడించిన మహిళ నేత ఎవరైనా ఉన్నారా అని అంటే అది కేవలం రేణుకచౌదరి మాత్రమే . ఎన్ టి అర్ టీడీపీని స్థాపించిన కొత్తల్లో రేణుక చౌదరి ఆపార్టీలో చేరి చురుకైన పాత్ర పోషించారు . ఆమె ప్రసంగాలలో ఫైర్ కనిపించేది . ప్రత్యర్థి ఎంతటి వారైనా ఆమె ఏ మాత్రం జంకే వారుకాదు. సవాల్ విసరడమే కాదు - నిప్పుకణిక లాంటి డైలాగులు - రెచ్చగొట్టే ప్రసంగాలు ఉండేవి.
అయితే ఒక్కోసారి ఆమె తీరు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేవి. వాటిని అస్త్రంగా ఉపయోగించుకునే ప్రత్యేర్ధులే రేణుకను ఇరుకున పెడుతుంటుంటారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో సభలో ఉన్న రేణుకా చౌదరి పెద్దగా నవ్వడం వివాదాస్పదైమంది. సభలో మోడీ మాట్లాడుతూ అద్వానీ ఉన్నప్పుడే ఆధార్ కార్డుకు బీజం పడిందని అన్నారు. ఆ వ్యాఖ్యలపై పక్కనే ఉన్న రేణుకు చౌదరి పెద్దగా నవ్వారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ - డిప్యూటీ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు "ఏమైంది మీకు - ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లండి" అని అన్నారు.
వెంకయ్య వ్యాఖ్యలపై "రేణుక గారిని మీరు ఏమీ అనకండి అధ్యక్షా - రామాయణం సీరియల్ తర్వాత ఇలాంటి నవ్వును చూసే అదృష్టం మళ్లీ ఇప్పుడే కలిగింది" అని మోడీ అన్నారు. దీంతో బీజేపీ సభ్యులు మోడీకి మద్దతు పలుకుతూ బల్లలు చరిచారు.
రేణుకా తన నవ్వుతో ఓకింత నవ్వులు పాలయ్యారనేది ప్రజల నుంచి వినిపిస్తున్నమాట. మరి అంతటి ఫైర్ బ్రాండ్ అయిన రేణుకా రాజకీయాలకు రాకముందే ఇలాగే ఉన్నానంటూ ఓ డిజిటల్ మీడియా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.
సమాజంలో అన్నీ రకాలా వ్యక్తులు ఉన్నారని , వారితో పోటీ పడాలని అన్నారు. దీనిపై సదరు యాంకర్ సందేహం వ్యక్తం చేస్తూ 'కాలేజీ రోజుల్లో అబ్బాయిలు మీ దగ్గరకు రావాలన్నా భయపడి ఉండేవాళ్లేమో అని ప్రశ్నించింది. అవును ఆకాతాయల్ని మోటార్ సైకిల్ చైన్ తో ఉతికి ఆరేసా. నేను ఎవర్నో చావగొడుతుంటే చుట్టుపక్కల వాళ్లు తనకు మద్దతు పలికేవారంటూ అంటూ బిగ్గరగా నవ్వేశారు.