Begin typing your search above and press return to search.
ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు ఎక్కడకు వెళ్లారు? రేవంత్ సంచలనం
By: Tupaki Desk | 26 Oct 2021 12:30 PM GMTతెలంగాణ రాష్ట్రం గురించి గొప్పలు చెప్పే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటల్లో ముఖ్యమైనది విద్యుత్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో చీకట్లు అలుముకుంటాయని.. రాష్ట్రం ఆగమాగం అయిపోతుందని సమైక్య పాలకులు శాపాలు పెట్టారని.. కానీ.. తన సమర్థతతో ఆ గండాన్ని అధిగమించటమే కాదు.. విద్యుత్ లో తిరుగులేని పరిస్థితులో ఉన్నట్లుగా చెప్పుకుంటారు. ఇవాల్టి రోజున ఏపీలో విద్యుత్ కోతలు ఉన్నాయే కానీ.. తెలంగాణలో లేవని ఆయన చెప్పటం తెలిసిందే. ఇలాంటివేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
విద్యుత్ సంక్షోభం నుంచి తెలంగాణ రాష్ట్రం బయటపడిందంటే కారణం.. తెలంగాణ ట్రాన్స్ కో.. జెన్ కో సీఎండీగా వ్యవహరించిన దేవులపల్లి ప్రభాకర్ రావు సమర్థతగా చెబుతారు. అలాంటి ఆయన కనిపించకుండా పోయారని అంటున్నారు. కొన్ని రోజులుగా ప్రభాకర్ రావు కనిపించటం లేదని.. ఆయన ఎక్కడ ఉన్నారో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రభాకర్ రావు కనిపించకుండా పోవటానికి పెద్ద కుట్ర ఉందన్న రేవంత్.. సంచలన విషయాల్ని తెర మీదకు తీసుకొచ్చారు.
ఇందులో నిజం ఎంత? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ప్రభాకర్ రావు కనిపించకుండా పోవటానికి కారణం.. భద్రాద్రి.. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రభాకర్ రావును ముందు పెట్టి పవర్ ఫైనాన్స్ కొర్పారేషన్ నుంచి రూ.35 వేల కోట్ల రుణం తీసుకుందని.. దానికి ప్రతి నెలా వడ్డీ.. ఉద్యోగుల జీతభత్యాల కింద రూ.1200 కోట్లు ప్రభుత్వం ఇస్తేనే విద్యుత్ శాఖ నడుస్తుందని ప్రభాకర్ రావు నివేదిక ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈ నివేదికను సీఎం కేసీఆర్ చెత్త బుట్టలో వేశారని.. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయన సెలవు మీద కనిపించకుండా పోయారని చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న రూ.35వేల కోట్ల రుణానికి ప్రభాకర్ రావు బాధ్యులు అవుతారని.. సీఎం కేసీఆర్ తీరుతో సమాధానం చెప్పలేని ప్రభాకర్ రావు తీవ్రమైన ఒత్తిడితో కనిపించకుండా వెళ్లిపోయారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభాకర్ రావు వెళ్లిపోవటంతో సింగరేణి సీఎండీకి అదనపు బాధ్యతలు ఇచ్చినట్లుగా రేవంత్ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ప్రభాకర్ రావు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ రేవంత్ సవాలు విసురుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.