Begin typing your search above and press return to search.
హాస్పిటల్ నుండి అదృశ్యమైన కాంగ్రెస్ నేత .. ఎవరంటే ?
By: Tupaki Desk | 1 Nov 2020 1:30 AM GMTమాజీ మేయర్, కాంగ్రెస్ నేత సంపత్ రాజ్ కనబడటం లేదట. అయన ఈ మద్యే కరోనా మహమ్మారి భారిన పడిన సంగతి తెలిసిందే. దీనితో అయన కరోనా మహమ్మారి కి చికిత్స తీసుకోవడం కోసం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. తాజాగా కరోనా నుండి కోలుకొని ఆసుపత్రి నుంచి డీఛార్జ్ అయ్యారు. అయితే ఆ తరువాత సంపత్ రాజ్ అదృశ్యమయ్యారు. దీనితో అయన మిస్సింగ్ పై పలు అనుమానాలు అందరిలో మొదులుతున్నాయి.
దీనిపై పూర్తి వివరాలని చూస్తే ... కర్నాటక కాంగ్రెస్ నాయకుడు సంపత్ రాజ్ కి కరోనా సోకడంతో చికిత్స కోసం నగరంలోని ఎసిపి ఆస్పత్రిలో చేరారు. ఇటీవల బెంగళూరు నగరంలో జరిగిన మాబ్ హింస కు సంబంధించిన కేసులో సంపత్ రాజ్ నిందితుడిగా ఉన్నారు. దీనితో ఈ కేసుకు ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అయిన జాయింట్ కమిషనర్, సిటీ క్రైమ్ బ్రాంచ్ సందీప్ పాటిల్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వేణుగోపాల్ అక్టోబర్ 7న ఆసుపత్రికి రాజ్ డిశ్చార్జ్ గురించి సమాచారం ఇవ్వడానికి లిఖితపూర్వక నోటీసు ఇచ్చారు. పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా డిశ్చార్జ్ చేసినందుకు, శనివారం ఎసిపి ఆసుపత్రిని సందర్శించిన అధికారులు నోటీసులు ఇచ్చారు.అయితే అసలు సంపత్ ఏమయ్యడనే కోణంతో పాటు అనేక కోణాల్లో సంపత్‌ను తిరిగి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.