Begin typing your search above and press return to search.

బీజేపీలో..గ‌వ‌ర్న‌ర్ అర్హ‌త క‌లిగిన నాయ‌కుడు లేడా?

By:  Tupaki Desk   |   6 Jan 2018 5:00 PM GMT
బీజేపీలో..గ‌వ‌ర్న‌ర్ అర్హ‌త క‌లిగిన నాయ‌కుడు లేడా?
X
మాజీ కేంద్ర మంత్రి - కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ మ‌రోమారు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ పై విరుచుకుప‌డ్డారు. మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి నాయ‌కుడు మందకృష్ణ మాదిగను చంచల్‌ గూడ జైలులో స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ శ‌నివారం ప‌రామ‌ర్శించారు. అనంత‌రం అయన మీడియాతో మాట్లాడుతూ ఇటు టీఆర్ ఎస్ స‌ర్కారుపై అటు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ పై విరుచుకుప‌డ్డారు. ఎస్సీ వర్గీకరణకు పోరాడుతున్న మందకృష్ణను జైల్లో పెట్టడం అప్రజాస్వామికమని సర్వే సత్యనారాయణ టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌ హిట్లర్‌ లా మారారని విమర్శల వర్షం గుప్పించారు.

ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్‌ నేత మందకృష్ణను జైల్లో పెట్టడం అప్రజాస్వామికమని సర్వే సత్యనారాయణ టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉద్య‌మ‌కారుడు అయిన మందకృష్ణ మాదిగను అరెస్టు చేసి చంచల్‌ గూడ జైలుకు త‌ర‌లించ‌డం రాష్ట్ర ప్ర‌భుత్వ అణిచివేత దోర‌ణికి నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డ్డారు. త్వరలో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్‌ కార్యాచరణ ప్రకటిస్తుందని కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో ఇంత జ‌రుగుతున్నాగ‌వ‌ర్న‌ర్‌ స్పందించ‌డం లేద‌ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. బీజేపీలో గవర్నర్‌ చేసే నాయకుడే లేరా..? అని సర్వే సత్యనారాయణ ప్ర‌శ్నించారు.

కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ - శాస‌న‌మండ‌లి నాయ‌కుడు షబ్బీర్‌ అలీ రాష్ట్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. తెలంగాణలో జరుగుతున్న దందాలన్నీ కేసీఆర్‌ కుటుంబం, కేసీఆర్‌ బంధువులు చేస్తున్నారని విమర్శించారు. ఇసుక మాఫియా విష‌యంలో స‌ర్కారు తీరు స‌రికాద‌న్నారు. మూఢ నమ్మకాల ముఖ్యమంత్రితో బంగారు తెలంగాణ సాధ్యమా..? అని ష‌బ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. ఒక కుటుంబం పాలనతో ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అండగా నిలిచి పోరాడుతోందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.