Begin typing your search above and press return to search.

ప్రియాంక చోప్రా జిందాబాద్ కొట్టిన కాంగ్రెస్ లీడర్ ..

By:  Tupaki Desk   |   2 Dec 2019 9:25 AM GMT
ప్రియాంక చోప్రా జిందాబాద్  కొట్టిన కాంగ్రెస్ లీడర్ ..
X
రాజకీయ నాయకులు కొన్నిసార్లు ఏమి మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా మాట్లాడుతుంటారు. కొందరైతే ఏం మాట్లాడుతారో ఎవరికీ అర్థం కాదు. సందర్భం లేకుండా ఏవో ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఇలాంటి నాయకుల మాటలు విని ప్రజలు పడిపడి నవ్వుకుంటారు. ఇక ఒక పార్టీ నేతగా తమ పార్టీ అగ్రనేతలపై అభిమానం ఉండటం సహజం. అయితే ఆ అభిమానం ఒక పరిమితి దాటితే ..ఎలా ఉంటుందో ఈ ఘటనే ఉదాహరణ. ఢిల్లీ లో తాజాగా జరిగిన ఒక సభలో ఎలాగైనా పార్టీ పెద్దలని ఆకట్టుకోవాలని చేసిన ఒక ప్రయత్నం బెడిసికొట్టింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.

ఇక జరిగింది ఏమిటంటే .. ఢిల్లీలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ఒక బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకు ఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సుభాష్‌ చోప్రా హాజరయ్యారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం పట్ల తన అభిమానంను చాటుకోవాలని భావించారు. కానీ , ఆ తొందరపాటుతో ఇలా అడ్డంగా బుక్కైపోతానని అనుకోని ఉండడు. కాంగ్రెస్‌ నాయకుడు సురేంద్ర కుమార్‌ సభలో మాట్లాడుతూ కొన్ని నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ - సోనియాగాంధీ జిందాబాద్ - రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ గాంధీ కుటుంబానికి జేజేలు పలికాడు. ఇంతవరకు అంతా బాగానే ఉంది.

ఆ తరువాత ప్రియాంక గాంధీకి జిందాబాద్ చెప్పాలని అనుకున్నాడు. అదే తడువుగా ప్రియాంక చోప్రా జిందాబాద్ అంటూ ప్రియాంక చోప్రాకి జేజేలు కొట్టారు.దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి. వెంటనే తన తప్పును తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సురేంద్ర కుమార్..ఆ మాటని సరి చేసుకున్నారు. ప్రియాంకగాంధీ జిందాబాద్ అని చెప్పారు. కానీ , ప్రియాంక చోప్రాకి జిందాబాద్ కొట్టిన ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్‌ గా మారింది.