Begin typing your search above and press return to search.
సిద్ధరామయ్య కు తీవ్ర అస్వస్థత .. ఐసీయూ లో చికిత్స !
By: Tupaki Desk | 12 Dec 2019 4:50 AM GMTకర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ సీఎం సిద్ధరామయ్య అనారోగ్యానికి గురయ్యారు. ఛాతినొప్పితో బాధ పడుతున్న ఆయనను హుటా హూటీన ఆస్పత్రి లో చేర్చారు. ఆయనను పరీక్షించిన వైద్యులు సిద్ధరామయ్య గుండెకు రక్తం సరిగా సరఫరా కావడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, భయపడాల్సిందేమీ లేదని వైద్యులు తెలిపారు. తన తండ్రికి గుండెపోటు సమస్య ఉందని ఆయన కుమారుడు యతీంద్ర సిద్ద రామయ్య తెలిపారు. సిద్దరామయ్య ఈ రోజు మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాగా, తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను మాజీ సీఎం సిద్ద రామయ్య ఖండించారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగం గానే ఆసుపత్రి లో చేరానని, తాను పూర్తి ఆరోగ్యం గా ఉన్నానని స్పష్టం చేశారు.
ఇకపోతే తాజాగా కర్ణాటకలో 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా అందులో ఏకంగా 12 స్థానాల్లో బిజెపి గెలిచింది. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత (సీఎల్సీ) పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రజా తీర్పును కాంగ్రెస్ పక్ష నేతగా తాను గౌరవించాలని చెప్పారు. సీఎల్పీ పదవికి రాజీనామా చేశానని... రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించానని తెలిపారు.