Begin typing your search above and press return to search.

ఆ బీజేపీ ఎమ్మెల్యే నాలుక కోస్తే 5ల‌క్ష‌ల రివార్డ్‌

By:  Tupaki Desk   |   7 Sep 2018 6:31 AM GMT
ఆ బీజేపీ ఎమ్మెల్యే నాలుక కోస్తే 5ల‌క్ష‌ల రివార్డ్‌
X
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టం ద్వారా వార్త‌ల్లో ప్ర‌ముఖంగా క‌నిపించ‌ట‌మే కాదు.. పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తున్న బీజేపీ ప్ర‌జాప్ర‌తినిధుల సంఖ్య అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నారు. ఇటీవ‌ల ప్రేమను నిరాక‌రించిన యువ‌తుల్ని కిడ్నాప్ చేసి మ‌రీ పెళ్లి చేస్తానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మ‌హారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ క‌ద‌మ్ చేసిన వ్యాఖ్య‌ల తీవ్ర‌త ఇంకా చ‌ల్లార‌లేదు.

ఎవ‌రైనా యువ‌కుడు ఏ అమ్మాయిపైనైనా మ‌న‌సు ప‌డితే.. అత‌గాడి ప్రేమ‌ను నిరాక‌రిస్తే.. ఆ విష‌యాన్ని త‌న‌కు చెబితే.. స‌ద‌రు అమ్మాయిని కిడ్నాప్ చేసుకొచ్చి మ‌రీ పెళ్లి చేస్తానంటూ దారుణ వ్యాఖ్య‌ల‌కు తెగ‌బ‌డ్డాడు. ఈ వ్యాఖ్య‌ల‌పై దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించ‌టంతో పాటు తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు గుర‌య్యేలా చేశాయి. శ్రీ‌కృష్ణ జ‌న్మాష్ట‌మి సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ వ్యాఖ్య‌లు చేశారు.

దీనిపై మ‌హారాష్ట్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సుబోధ్ సాన్జీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని మండిప‌డిన ఆయ‌న‌.. బాధ్య‌త క‌లిగిన ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టంలో అర్థం లేద‌న్నారు. ఎమ్మెల్యే ఇలా వ్యాఖ్య‌లు చేస్తే మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఎలా అన్న ఆందోళ‌న‌నువ్య‌క్తం చేశారు.

యువ‌తుల‌ను కిడ్నాప్ చేస్తానంటూ వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ ఎమ్మెల్యే నాలుక కోసి తీసుకొస్తే రూ.5ల‌క్ష‌ల ఇవ్వ‌నున్నట్లు ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఎప్ప‌టిలానే త‌న వ్యాఖ్య‌ను మీడియా త‌ప్పుగా అర్థం చేసుకుందంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే వివ‌ర‌ణ ఇస్తున్నారు. తాను త‌ప్పుడు ఉద్దేశంతో వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని.. దాన్ని మీడియా త‌ప్పుగా అర్థం చేసుకుంద‌న్నారు.