Begin typing your search above and press return to search.
ఏందిబై ఇదీ.. పోలీసులనే బెదిరించిన వీహెచ్
By: Tupaki Desk | 7 Jan 2020 11:20 AM GMT‘అరే ఏంది బై ఇదీ.. ఇందిరాగాంధీ తో పని చేసిన.. 50 ఇయర్స్ పాలిటిక్స్ సీనియర్ నీ.. నే ఇస్తే ఫిర్యాదు తీసుకోరా.. కేసు పెట్టరా’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు హల్ చల్ చేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై కేసు ఎందుకు పెట్టరని పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. పోలీసులు సమాధానం ఇచ్చినా వీహెచ్ తాత వినలేదు. తాను హైకోర్టుకు వెళతానని పోలీసులను హెచ్చరించారు. ఇదంతా మంగళవారం మధ్నాహ్నం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో చోటుచేసుకుంది.
వారం రోజుల కిందట హైదరాబాద్ లో పర్యటించిన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యలపై వీహెచ్ ఎల్బీనగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దేశంలో అందరూ హిందువులేనంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇతర మతాల వారిని బాధపెట్టాయని వీహెచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే వారం గడిచినా వీహెచ్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు కాక పోవడం తో మంగళవారం స్టేషన్ కు వచ్చి పోలీసులను నిలదీశారు. అయితే దీనిపై తాము న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నామని.. ఇందులో కేసు నమోదు చేసే అంశాలు లేవని.. అందుకే కేసు పెట్టలేదని పోలీసులు సమాధానమిచ్చినా వీహెచ్ ఆగ్రహంతో చిందులు తొక్కారు. హైకోర్టు కెక్కడానికి రెడీ అయ్యారు.