Begin typing your search above and press return to search.

తమిళిసైకి కేసీఆర్ ను ఇరికించిన రాములమ్మ!

By:  Tupaki Desk   |   8 Sept 2019 12:29 PM IST
తమిళిసైకి కేసీఆర్ ను ఇరికించిన రాములమ్మ!
X
సమయం.. సందర్భం చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఇరికించింది మన రాములమ్మ కాంగ్రెస్ నేత విజయశాంతి.. తెలంగాణ రెండో గవర్నర్ గా మహిళ అయిన తమిళిసై సౌందర్యరాజన్ ప్రమాణ స్వీకారం చేసిన వేళ ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫేస్ బుక్ లో ఆమె చేసిన పోస్టు వైరల్ అయ్యింది.

తెలంగాణ తొలి ప్రభుత్వంలో కనీసం మహిళలకు మంత్రి పదవి లేదని.. మీరు వచ్చాకైనా చోటు ఉండేలా చూడాలంటూ కేసీఆర్ ప్రభుత్వంపై రాములమ్మ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమం మల్లారెడ్డి అనే మగ మంత్రి నిర్వహిస్తున్నాడని ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు. ఇప్పటికీ తొమ్మిదినెలలైనా మహిళలను మంత్రివర్గంలోకి తీసుకోలేదని ఫిర్యాదు చేశారు.

తెలంగాణకు పెద్దదిక్కుగా మహిళ అయిన మీరు రావడం గర్వకారణమని.. అదే సమయంలో తెలంగాణ మహిళల ఔన్నత్యాన్ని పెంచాలని విజయశాంతి తమిళిసైని కోరారు. తెలంగాణ మహిళా మంత్రి లేని లోటును మీరు తీరుస్తారని భావిస్తున్నానంటూ విజయశాంతి పేర్కొన్నారు.

ఇక నుంచి తెలంగాణ మహిళల సమస్యలను పట్టించుకునే దిక్కు మీరేనంటూ కేసీఆర్ తీరుపై రాములమ్మ చేసిన పోస్టుకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. కరెక్ట్ టైమింగ్ చూసి కేసీఆర్ ను కొట్టిన రాములమ్మ పోస్టు వైరల్ గా మారింది.