Begin typing your search above and press return to search.

వారి నుంచి తుపాకీ లాగేసిన యాద‌గిరి

By:  Tupaki Desk   |   13 Aug 2016 10:15 AM GMT
వారి నుంచి తుపాకీ లాగేసిన యాద‌గిరి
X
రీల్‌లో క‌నిపించే సీన్ ఒక‌టి రియ‌ల్‌ గా చోటు చేసుకోవ‌టం ఒక చిత్ర‌మైతే.. సినిమాటిక్‌ గా వ్య‌వ‌హ‌రించిన కాంగ్రెస్‌ నేత యాద‌గిరి ధైర్యాన్ని పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. సికింద్రాబాద్ బోయిన్‌ ప‌ల్లిలోని మ‌ల్లికార్జున న‌గ‌ర్‌ లో బైక్ మీద వ‌చ్చిన ఇద్ద‌రు దుండ‌గులు కాంగ్రెస్ నేత యాద‌గిరిపై తుపాకీతో కాల్పులు జ‌ర‌ప‌టం తెలిసిందే.

మొత్తం ఆరురౌండ్లు కాల్చిన వేళ‌.. యాద‌గిరి చూపించిన తెగువ‌.. ధైర్యం ప‌లువురిని సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేస్తుంద‌ని చెబుతున్నారు. తుపాకీ చేతిలో ఉన్న వేళ‌.. కాల్చి చంపేయాలని వ‌చ్చిన దుండ‌గుల తీరును తీవ్రంగా ప్ర‌తిఘ‌టించ‌ట‌మేకాదు.. తొడ‌లో.. ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లినా.. త‌న‌పై కాల్పులు జ‌రుపుతున్న వారి చేతిలోని తుపాకీని లాగేసుకున్న వైనం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.

ఊహించ‌ని రీతిలో రియాక్ట్ అయి త‌న‌ను చంపాల‌ని వ‌చ్చిన వారికి షాకిచ్చిన యాద‌గిరి దెబ్బ‌కు దుండ‌గులు పారిపో్యారు. వారి చేతుల్లోని తుపాకీని లాగేసుకున్న యాద‌గిరి.. దాన్ని పోలీసుల‌కు అందించారు. ఈ విష‌యాన్ని హైద‌రాబాద్‌ డీసీపీ సుమ‌తి కొద్దిసేప‌టి క్రితం మీడియాకు వెల్ల‌డించారు. ఒంట్లోకి బుల్లెట్లు దూసుకెళ్లినా వెన‌క్కి త‌గ్గ‌ని యాద‌గిరి ధైర్యాన్ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. ఇక‌.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న యాద‌గిరిని ఆదివారం డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.