Begin typing your search above and press return to search.

శశిథరూర్ కు చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్ నేతలు

By:  Tupaki Desk   |   3 Oct 2022 9:37 AM GMT
శశిథరూర్ కు చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్ నేతలు
X
100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడి కొరత ఏర్పడడం నిజంగా విడ్డూరం. వృద్ధాప్యంతో అటు సోనియా చేయలేకపోతుండడం.. ఇటు ఒక సారి తీసుకొని చేతులు కాల్చుకున్న రాహుల్ గాంధీ ముఖం చాటేయడంతో కాంగ్రెస్ లోని సీనియర్లకు ఈ పోస్ట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది.

మొదట రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను సంప్రదించింది. ఆయన ఒప్పుకొని రాజస్థాన్ లో మంట రాజేయడంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఆయనను తప్పించిన అధిష్టానం ఆతర్వాత మధ్యప్రదేశ్ సీనియర్ దిగ్విజయ్ సింగ్ ను చేద్దామనుకుంది. ఆయన అయిష్టత చూపడంతో ఇక కర్ణాటక దళిత సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేను నిలబెట్టింది.

ఈయనను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని చూసింది.కానీ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా బరిలోకి దిగాడు సీనియర్ నేత శశిథరూర్. ఇప్పుడు పార్టీలోనే అసమ్మతి రాజేశాడు. ఏకగ్రీవం చేద్దామని సోనియా గాంధీ ప్రయత్నించినా శశిథరూర్ మాత్రం అధ్యక్ష ఎన్నికల్లో బరిలోనే ఉంటానని చెప్పి షాకిచ్చాడు.

దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తారు. సోనియా, రాహుల్ సహా దేశంలోని కాంగ్రెస్ నేతలంతా ఖర్గేకే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. కానీ శశిథరూర్ మాట వినకుండా రాష్ట్రాలు తిరుగుతూ కాంగ్రెస్ నేతలను కలిసే పనిలో బిజీగా ఉన్నారు.

తాజాగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చాడు శశిథరూర్. ప్రచారంలో భాగంగా కలవాలని ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. కానీ తన బంధువు చనిపోయారని..తాను కలవలేనంటూ రేవంత్ రెడ్డి తప్పించుకున్నారు. దీంతో మరోసారి రేవంత్ ను కలుస్తానని శశి ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

ఇలా కాంగ్రెస్ అధ్యక్ష బరిలో వద్దంటున్నదిగిన శశిథరూర్ కు నేతలు చుక్కలు చూపిస్తున్నారు. ఇదివరకూ లోక్ సభా పక్ష నాయకుడిగా చేసిన ఖర్గేకే కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. శశిథరూర్ ను ఒంటరిని చేసి నేతలంతా దూరం పెడుతున్న పరిస్థితి నెలకొంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.