Begin typing your search above and press return to search.

మునుగోడు ఎఫెక్ట్‌.. కాంగ్రెస్ నుంచి జంపింగులు!

By:  Tupaki Desk   |   14 Nov 2022 9:07 AM GMT
మునుగోడు ఎఫెక్ట్‌.. కాంగ్రెస్ నుంచి జంపింగులు!
X
తెలంగాణ‌లో ఇప్పుడిప్పుడే గాడిన ప‌డుతోంద‌ని భావించిన కాంగ్రెస్ పార్టీకి.. ఇటీవ‌ల జ‌రిగిన మునుగోడు ఉప ఎన్నిక భారీ షాక్ ఇచ్చింది. దీని నుంచి పార్టీ నాయ‌కులు, శ్రేణులు ఇంకా కోలు కోలేదు.

పార్టీ అధ్య‌క్షు డు రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వ‌చ్చినా.. మునుప‌టి జోష్ క‌నిపించ‌లేదు. ఏదో.. ఈ బాధ నుంచి కోలుకునేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుందిలే.. అని అనుకుంటున్న స‌మ‌యంలో మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది.

కాంగ్రెస్ నుంచి మ‌ళ్లీ జంపింగుల ప‌ర్వానికి తెర‌దీసింది.. బీజేపీ. ఇప్ప‌టికేఅనేక మందిని పార్టీ మార్పించి.. కాంగ్రెస్‌ను దెబ్బ‌తీస్తున్న బీజేపీ ఈ ప‌రంప‌ర‌లో తాజాగా నిర్మ‌ల్ జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రామారావు పా టిల్‌కు ఎర‌వేసిన‌ట్టు మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. వాస్త‌వానికి మునుగోడు ఎన్నిక‌ల‌కు ముందుగానే రామారావు పార్టీ మార‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఎందుకో ఆయ‌న అస‌లు మీడియా కంట ప‌డ‌కుండా వ్య‌వ‌హ‌రించారు.

ఇక‌, ఇప్పుడు జంపింగ్‌కు సంబంధించి ఆయ‌నే మీడియాకు క్లూలిస్తున్నారు. కొద్ది రోజులుగా బీజేపీ ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతున్న రామారావు.. కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఆయ‌న‌ బైంసాలో తన అనుచరులతో జరిపే సమావేశంలో పార్టీ మార్పుపై ప్రకటన చేశారు. బీజేపీ నుంచి ఆహ్వానం అందినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అనుచరులతో రామారావు అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు.

స్థానిక బీజేపీ, హిందూ సంఘాల నేతలతోనూ ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో రామారావు పాటిల్ ముథోల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియామకమయ్యారు.

బీజేపీలో చేరే విషయంలో కార్యకర్తల అభిప్రాయం మేరకు భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 28న బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఏదేమైనా కాంగ్రెస్‌కు భారీ దెబ్బ ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మనార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.