Begin typing your search above and press return to search.
మోడీజీ.. అంజయ్య దళితుడు కాదుజీ!
By: Tupaki Desk | 13 May 2019 6:33 AM GMTఅంత పెద్ద ప్రధానమంత్రి స్థానంలో ఉన్న నరేంద్ర మోడీ.. చాలా సందర్భాల్లో పుసుక్కున తప్పులు చెప్పేస్తుంటారు. ఏదో మామూలు వ్యక్తి నోటి నుంచి ఒకట్రెండు తప్పుడు మాటలు రావటం వల్ల జరిగే నష్టం చాలా తక్కువగా ఉంటుంది. కానీ.. ప్రధాని స్థానంలో కూర్చున్న వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటలు.. సత్యదూరంగా ఉండటమే కాదు.. నిజాన్ని తప్పుదారి పట్టించేలా ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అంజయ్యను దళితుడిగా పేర్కొంటూ మోడీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఇంటి వారు.. కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. దళితుల్ని ఆకర్షించేందుకు మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారే తప్పించి అంజయ్య.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారుగా అంజయ్య మనమడు.. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కార్యదర్శి అభిషేక్ రెడ్డి తప్పు పట్టారు.
ఇటీవల మోడీ మాట్లాడుతూ.. రాజీవ్ జీవితం అవినీతి నెంబర్ 1గా మారిందని తప్పు పట్టటంతో పాటు.. ఏపీ ముఖ్యమంత్రి అంజయ్యను ఉద్దేశించి ఆయన్నుదళితుడిగా పేర్కొంటూ.. ఈ కారణంతోనే రాజీవ్ గాంధీ అవమానించినట్లుగా మోడీ చెప్పటాన్ని తప్పు పట్టారు. దళితుడైన అంజయ్యను రాజీవ్ గాంధీ ఘోరంగా అవమానించినట్లుగా చెబుతున్న మోడీ మాటల్లో నిజం లేదంటున్నారు
తన తాతను పదే పదే దళితుడిగా పేర్కొనటాన్ని తప్పు పట్టారు. పేదవారి గురించి ఆలోచించటం.. వారి అభ్యున్నతికి కృషి చేయటం వల్ల అంజయ్యను దళితపక్షపాతిగా పేర్కొంటారు. ఈ క్రమంలో ఆయన్ను తమ వర్గానికి చెందిన సొంత మనిషిగా అంజయ్యను భావిస్తుంటారు. గూగుల్ మాటల్ని అప్పజెప్పే మోడీ.. ఇలాంటి విషయాల్లో తప్పులు చేస్తుంటారు. ఇప్పటికే పలుమార్లు అంజయ్య విషయంలో తప్పులు చేసిన మోడీ మాటలు ఇకనైనా మార్చుకోవాలని అంజయ్య మనమడు డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవానికి అంజయ్య అసలు పేరు రామకృష్ణారెడ్డి అని.. అయినప్పటికీ ఎయిర్ పోర్ట్ లో రాజీవ్ తమ తాతను అవమానించలేదన్నారు. ప్రధాని పదవిలో ఉండి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్న వైనాన్ని తప్పుపట్టారు. అదేంది మోడీ.. మన టీంలో ఎవరికి తెలుగు రాష్ట్రాల హిస్టరీ మీద.. రాజకీయ నేతల వివరాలకు సంబంధించి సరైన ఇన్ పుట్స్ ఇచ్చే వారు లేరా? అన్న సందేహం కలుగక మానదు.