Begin typing your search above and press return to search.
అజ్ఞాతవాసిగా మారిపోయిన సీఎం
By: Tupaki Desk | 5 Jun 2018 10:52 AM GMTగోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. ప్రాంకియాటైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న పారికర్ అమెరికాలో చికిత్స తీసుకుంటున్నాడు. అప్పటి నుంచి రాష్ట్ర పరిపాలన బాధ్యతలను ఆయన ముగ్గురు మంత్రులకు అప్పగించి అమెరికా నుంచి పర్యవేక్షిస్తున్నారు.
గోవా ముఖ్యమంత్రి నాలుగు నెలలుగా కనిపించకపోవడంతో కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోంది. ముఖ్యమంత్రి ఖాతాలోని డబ్బును దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేక పాలన కుంటు పడిందని ఆరోపించాయి. రాష్ట్రానికి మరో వ్యక్తి ని సీఎంగా నియమించాలని డిమాండ్ చేశాయి.
ముఖ్యమంత్రి మనోహార్ అజ్ఞాతవాసంపై దుమారం రేగడంతో ఎట్టకేలకు పారికర్ తాజాగా తనకు సన్నిహితంగా ఉన్న జర్నలిస్టులకు ఫోన్ చేసి రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఆరాతీశారు. రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. కొద్దిరోజుల్లోనే తిరిగి రాష్ట్రానికి రానునట్లు పేర్కొన్నారు. సీఎంతో మాట్లాడిన జర్నలిస్టులు ఈ మేరకు మీడియాకు వివరించారు. కొద్దిరోజుల్లోనే సీఎం అజ్ఞాతవాసం వీడి గోవా రాబోతున్నాడని చెప్పారు.