Begin typing your search above and press return to search.

మునుగోడులో నిలదీతలు.. రాజగోపాల్ రెడ్డికి అంత ఈజీ కాదు?

By:  Tupaki Desk   |   7 Sep 2022 4:30 PM GMT
మునుగోడులో నిలదీతలు.. రాజగోపాల్ రెడ్డికి అంత ఈజీ కాదు?
X
కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గంలో అంత ఈజీగా పరిస్థితులు లేవని అర్థమవుతోంది. తాజాగా ఆయన తన మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తే అడుగడుగునా నిలదీత పర్వం కనిపించింది. దీంతో ఆయనకు మునుగోడులో గెలుపు అంత సులభం కాదని అర్థమవుతోంది.

మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. ఈ పరిణామంతో రాజగోపాల్ రెడ్డి షాక్ అయ్యారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని తంగపాడు గ్రామంలో మంగళవారం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో వివాదం చెలరేగింది.

కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సౌండ్ తో రేవంత్ రెడ్డి పాట పెట్టారు. దీంతో సౌండ్ తగ్గించాలని బీజేపీ కార్యకర్తలు కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పార్ీ ఎందుకు మారావంటూ రాజగోపాల్ రెడ్డిని నిలదీశారు. పార్టీ మారిన వ్యక్తి గ్రామానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రసంగించాలని రాజగోపాల్ రెడ్డి ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడడంతో ఆయన వెళ్లిపోయారు.

కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన  రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గంలో  క్షేత్రస్తాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవని పరిస్థితులను బట్టి తెలుస్తోంది. కోమటిరెడ్డి క్యాడర్ అంతా కూడా టీఆర్ఎస్ లో చేరిపోయారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అంతా టీఆర్ఎస్ లోకి వెళ్లారు.

సో కోమటిరెడ్డి ఇప్పుడు మునుగోడులో ఒంటరి.. ఇక మునుగోడు అస్సలు బీజేపీకి క్యాడర్, నేతలు లేరు. ఇక డబ్బులన్నీ బడాబాబు అయిన కోమటిరెడ్డినే పెట్టుకోవాలి. ఇంత రిస్క్ చేసి బీజేపీలోకి వెళ్లి గెలుస్తానో లేదో నమ్మకం లేకపోవడంతోనే కోమటిరెడ్డి కంగారుపడుతున్నాడట.. ఇప్పుడు నియోజకవర్గంలో తిరుగుతుంటే వ్యతిరేకత  ఆయనకు మింగుడుపడని వ్యవహారంగా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.