Begin typing your search above and press return to search.
కోటి సంతకాల్లో మొదటిది.. చివరిది ఎవరిదంటే..?
By: Tupaki Desk | 17 March 2016 4:30 AM GMTవిభజన నేపథ్యంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు.. ఏపీ కోలుకునేందుకు అత్యంత అవసరమైనదిగా భావించే ప్రత్యేక హోదా అంశంపై గడిచిన నాలుగు రోజులుగా ఏపీ కాంగ్రెస్ వివిధ కార్యక్రమాల్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో సేకరించిన కోటి సంతకాల కార్యక్రమాన్ని తాజాగా తెర మీదకు తీసుకొచ్చి.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలన్న డిమాండ్ పై ఆలస్యంగా నిద్ర లేచిన కాంగ్రెస్ నేతలు ఈ మధ్యన హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే.
తాము సేకరించిన కోటి సంతకాల్ని ప్రధాని మోడీకి ఇవ్వాలని ప్రయత్నించినా.. ఏపీ కాంగ్రెస్ నేతల్ని కలిసేందుకు అపాయింట్ మెంట్ అంగీకరించని పరిస్థితుల్లో పార్టీ అధినేత్రి సోనియాకు ఇచ్చే ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ సందర్భంగా తాము సేకరించిన కోటి సంతకాల్ని అధినేత్రికి అందించిన ఏపీ కాంగ్రెస్ నేతలు.. ఆమె ద్వారా ప్రధాని మోడీకి కోటి సంతకాలు చేరేలా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కోటి సంతకాల్లో తొలి సంతకం ఎవరిది? చివరి సంతకం ఎవరిదన్న లెక్కలోకి వెళితే ఆసక్తికర సమాచారం రావటం ఖాయం.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ కాంగ్రెస్ షురూ చేసిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో తొలి సంతకం ఏపీ కాంగ్రెస్ నేత.. మాజీ కేంద్రమంత్రి చిరంజీవిది కాగా.. చివరి సంతకం కాంగ్రెస్ ఉపాధ్యక్షులు.. యువరాజు రాహుల్ గాంధీది కావటం గమనార్హం. కోటి సంతకాల కార్యక్రమం జరిగిన తీరు చూస్తే.. చిరు బోణీ అదిరిపోతుందన్నమాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరుకు ఇలాంటి ఇమేజ్ అత్యవసరం.