Begin typing your search above and press return to search.
ఇది కాంగ్రెస్ నైజం..పీవీకి అవమానం..ఆయనకు గౌరవం
By: Tupaki Desk | 10 Aug 2018 5:38 AM GMTపీవీ నరసింహరావు. రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి పరిచయం అవసరం లేని పేరు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ వ్యవస్థను గాడిలో పెట్టిన పీవీ ప్రపంచానికి భారత్ సత్తాను చాటారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎంతగా అవమానించిందో చెప్పనక్కర్లేదు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణించినప్పుడు ఆయన పార్థివ దేహాన్ని ఏఐసీసీ కార్యాలయంలో ఉంచేందుకు అప్పటి కాంగ్రెస్ నాయకత్వం నిరాకరించింది. పార్టీకి సుదీర్ఘకాలం సేవ చేయడమేకాకుండా ప్రధాని పదవిని సైతం అధిష్టించిన వ్యక్తి పార్థివ దేహాన్ని పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకురాకుండా నాటి నాయకత్వం అవమానించిందని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అయితే, అలా పీవీని అవమానించిన కాంగ్రెస్ అదే పార్టీకి చెందిన ఓ సీనియర్ ను మృతదేహాన్ని పార్టీ కార్యాలయానికి తరలించి గౌరవించింది. ఈ పరిణామం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్కే ధావన్ గత మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తీసుకువచ్చింది. దీనిపైనే సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధావన్ ను గౌరవించిన కాంగ్రెస్ నాయకత్వం నాడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విషయంలో మాత్రం అవమానకరంగా వ్యవహరించిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ధావన్ మృతదేహానికి బుధవారం ఢిల్లీలోని లోధీ దహన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆయన పార్థివ దేహాన్ని ఏఐసీసీ కార్యాలయంలో కొద్దిసేపు ఉంచారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ - పార్టీకి చెందిన ఇతర నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. ఐతే ధావన్ కంటే సీనియర్ అయిన పీవీ విషయంలో ఆ పార్టీ ఎలా వ్యవహరించింది అనే సంగతి తెలిసిందే.
పార్టీకి సుదీర్ఘకాలం సేవ చేయడమేకాకుండా ప్రధాని పదవిని సైతం అధిష్టించిన వ్యక్తి పార్థివ దేహాన్ని పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకురాకుండా నాటి నాయకత్వం అవమానించిందని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. తాజాగా ధావన్ మృతదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తీసుకురావడంపై నెటిజన్లు పీవీ విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. మాజీ ప్రధానుల సమాధులకు ఢిల్లీలో స్థలం కేటాయించిన ప్రభుత్వం పీవీకి మాత్రం నిరాకరించడాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు.