Begin typing your search above and press return to search.
పొగిడిన కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ రియాక్షన్?
By: Tupaki Desk | 28 Jan 2017 5:16 AM GMTకలలు చాలామంది కంటారు. కొద్దిమంది మాత్రమే వాటిని సాకారం చేసే ప్రయత్నం చేస్తారు. మాటల్లో ఆదర్శాలు వల్లించటం పెద్ద విషయం ఎంతమాత్రం కాదు. కానీ.. వాటిని అమలు చేయాలంటే ఎంతో ధైర్యం అవసరం. సాహసం చాలా ముఖ్యం. రాజకీయాల్లో ఉన్నవారు.. మరి ముఖ్యంగా అధికారపక్షంలో ఉన్న వారికి.. మైలేజీ వస్తుంటే.. అదంతా గంపగుత్తగా తమకే సొంతం కావాలనుకుంటారే తప్పించి.. ఎదుటోళ్లకు కాస్త పోయేందుకు అస్సలు ఇష్టపడరు. అలాంటి రాజకీయ వాతావరణం ఉన్న మన దగ్గర అందుకు భిన్నంగా వ్యవహరించటం అరుదైన ముచ్చటనే చెప్పాలి.
ఇంచుమించు అలాంటి పనినే చేశారు తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన చొరవకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎంతలా కదలిపోయారంటే.. సాధారణంగా ఏ చిన్న అవకాశం వచ్చినా కేసీఆర్ ను తమ మాటలతో ఉతికి ఆరేసే భట్టి విక్రమార్క లాంటోళ్లు కూడా పొగిడేశారు. అభినందనల వర్షం కురిపించారు. మరి.. ఇంతగా వారు రియాక్ట్ కావాటానికి కేసీఆర్ ఏం చేశారు? అన్నది పెద్ద ప్రశ్న. ఆ విషయంలోకి వెళితే.. సరికొత్త రాజకీయం కనిపించటమే కాదు.. ఆదర్శాలు మాట్లాడే నేతల్లో కొందరు చేతల్లో కూడా చేసి చూపిస్తారన్న భావన కలగటం ఖాయం.
తెలంగాణ రాష్ట్రంలో దళితులు.. గిరిజనులు నూరు శాతం మెరుగైన జీవన ప్రమాణాల కోసం.. వారిలో అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న వారి అభ్యున్నతి ప్రభుత్వ పరంగా ఏం చేయాలి? అన్న అంశంపై అన్నిపార్టీల ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత విషయాల్ని పక్కన పెట్టేద్దామని.. విమర్శలు.. ప్రతి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా.. చట్టాన్ని మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఏం చేయాలి?ఎస్సీ.. ఎస్టీ ఉప ప్రణాళికలో చేయాల్సిన మార్పులు ఏమిటి? లాంటి ప్రశ్నలతో పాటు.. ఎస్సీ.. ఎస్టీలకు ఏమేం చేయాలన్నది తెలంగాణలో పార్టీలకు అతీతంగా ఆయా వర్గాల నుంచి వచ్చిన అన్ని పార్టీల నాయకులే నిర్ణయించాలని పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లు రెండు కమిటీల్ని ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు అన్ని పార్టీలకు చెందిన 38 మంది ఎస్సీ.. ఎస్టీ ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కావటం గమనార్హం.
ఇక.. ఎస్సీ కమిటీకి అధ్యక్షుడిగా గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్ వ్యవహరిస్తారు. సభ్యులుగా డీఎస్ రెడ్యానాయక్.. సీతారాం నాయక్.. నగేష్.. రాము నాయక్.. కోవా లక్ష్మి.. సున్నం రాజయ్య.. తాటి వెంకటేశ్వర్లుగా ఎంపిక చేశారు. ఇక.. ఎస్సీ కమిటీకి అధ్యక్షుడిగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. సభ్యులుగా నంది ఎల్లయ్య.. ఎంపీ బాల్క సుమన్.. ఎంఎస్ ప్రభాకర్.. సండ్ర వెంకట వీరయ్య.. భట్టి విక్రమార్క.. గీతారెడ్డి.. సంపత్కుమార్.. నల్లాల ఓదేలు.. రసమయి బాలకిషన్.. కిశోర్.. సంజీవరావు.. ఆరూరి రమేశ్ లను ఎంపిక చేశారు. ఇక.. ప్రత్యేక ఆహ్వానితులుగా కొప్పులు ఈశ్వర్ ఉండనున్నారు.
ఎస్సీ.. ఎస్టీవర్గాలకు ఏమేం చేయాలన్న అంశంపై భేటీలోపెద్ద ఎత్తున చర్చ జరగటంతోపాటు.. వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వర్గాలకు భూముల్ని కేటాయించినా సాగులోకి రాకపోవటాన్ని ప్రస్తావించారు. దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని అందజేసి వాటిని సాగులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన మౌలికసదుపాయాల్ని కల్పించాలని నిర్ణయించారు.
ఈసందర్భంగా ఉప ప్రణళికను సమర్థంగా అమలుచేసేందుకు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చొరవను భట్టివిక్రమార్క్ అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశం విప్లవాత్మక చర్చగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అవుతూ.. ఇప్పుడే అభినందలు వద్దని.. పరిస్థితుల్లో కొంత మార్పువచ్చిన తర్వాత అభినందనలు తెలపాలంటూ సూచనలు చేయటం గమనార్హం. గంటల కొద్దీ ఆదర్శాలు వల్లించే ప్రముఖులు.. చేతల విషయంలోమాత్రం భిన్నంగా వ్యవహరిస్తుంటారు. మొదట్నించి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉండాలని చెప్పే కేసీఆర్ మాటలకు తగ్గట్టే పరిణామాలు సాగుతుండటం శుభసూచకంగా చెప్పాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/