Begin typing your search above and press return to search.
పాక్ ముస్లింకు పద్మశ్రీ..కాంగ్రెస్ కౌంటర్..అద్నన్ ఎన్ కౌంటర్
By: Tupaki Desk | 27 Jan 2020 2:16 PM GMTకేంద్రం ఇటీవల ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల జాబితాలో అద్నాన్ సమీ పేరు కూడా ఉండడంపై కాంగ్రెస్ వాదులు, బీజేపీ వ్యతిరేకులు నిప్పులు చెరిగారు. మహారాష్ట్రకు చెందిన అద్నాన్ సమీగా కేంద్ర హోంశాఖ గుర్తించింది. నిజానికి సమీ అసలు ఆ రాష్ట్ర వాసి కానీ కాదు. పాకిస్తాన్ కు చెందిన ముస్లిం వ్యక్తి. భారతదేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడి పాటలు పాడుతూ దేశంలోనే ప్రముఖ గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. బీజేపీ ప్రభుత్వమే 2016 లో అద్నాన్ సమీకి భారత పౌరసత్వం ఇచ్చింది. తాజాగా పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.
పౌరసత్వం సవరణ చట్టం ముసుగులో పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ లోని హిందూ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని బీజేపీ సిద్ధపడింది. అయితే ఆయా దేశాల్లోని ముస్లింలు మాత్రం దేశంలోకి రావడానికి ఒప్పుకోలేదు. దీనిపై దేశవ్యాప్తంగా ముస్లింలు, కొన్ని వర్గాల వారు ఆందోళన చేసినా ముస్లింలపై మాత్రం బీజేపీ వెనక్కితగ్గలేదు. వారిని దేశంలోకి తీసుకోవడానికి ఒప్పుకోలేదు.
తాజాగా ఇదే బీజేపీ పాకిస్తాన్ కు చెందిన ముస్లిం, దేశంలో స్థిరపడిన ప్రముఖ గాయకుడు అద్నన్ సమీకి పౌరసత్వం,పద్మశ్రీ ఇచ్చింది. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. వివాదానికి దారితీసింది. బీజేపీ వ్యతిరేకులకు అస్త్రంగా మారింది.
అద్నన్ సమీకి బీజేపీ పౌరసత్వం, పద్మశ్రీ ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్(డిగ్గీ రాజా) సూటిగా ప్రశ్నించారు. పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తికి బీజేపీ పౌరసత్వంతోపాటు పద్మశ్రీ ఇచ్చినప్పుడు ఇక పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఎందుకని దిగ్విజయ్ ప్రశ్నించారు. ఓ పాకిస్తానీ ముస్లింకు బీజేపీ పౌరసత్వం ఇచ్చినప్పుడు మళ్లీ సీఏఏ ను ఎందుకు తీసుకొచ్చారని దిగ్విజయ్ ప్రశ్నించారు. ఇది కేవలం హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకునేని బీజేపీ తీరును ఎండగట్టారు దిగ్విజయ్ సింగ్.
ఇక ప్రభుత్వంకు చంచాగిరి చేసిన మ్యాజిక్ వల్లే అద్నాన్ సమీకి పద్మశ్రీ అవార్డు వచ్చిందని’ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ కూడా ట్విట్టర్ లో ఆరోపించారు.అసోం ఎన్నార్సీలో కార్గిల్ యుద్ధంలో పోరాడిన మహ్మద్ సన్నావుల్లాను విదేశీయుడిగా ఇదే బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందని.. కానీ పాకిస్తాన్ ముస్లింకు అవార్డు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైవీర్ షెర్గిల్ ఆరోపణలకు గాయకుడు అద్నన్ సమీ ధీటుగా బదులిచ్చాడు. ‘మీ బుద్దిని క్లియరెన్స్ సేల్ నుంచి తెచ్చుకున్నారా? సెకండ్ హ్యాండ్ స్టోర్ నుంచి కొనుకున్నారా? తల్లిదండ్రుల చర్యలకు పిల్లలు ఎలా బాధ్యులవుతారు? ’ అంటూ తన తల్లిదండ్రులు ముస్లిం అయినంత మాత్రాన తనను తప్పుపట్టడంపై అద్నన్ కౌంటర్ ఇచ్చారు. ఇలా పాకిస్తాన్ ముస్లిం అద్నన్ సమీ వ్యవహారం కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.