Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఓ నియంత

By:  Tupaki Desk   |   5 April 2015 5:14 PM GMT
కేసీఆర్ ఓ నియంత
X
తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌ల జోరు పెంచుతున్నారు. సంద‌ర్భం ఏదైనా సందు దొరికితే దుమ్మెత్తిపోస్తున్న‌రు.

గాంధీభవన్‌లో నిర్వహించిన జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్, పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టి విక్రమార్క జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రం నలుగురు వ్యక్తుల చేతిలో నలిగిపోతోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవిత, హరీష్‌రావుల కేంద్రంగా పాల‌న సాగుతోంద‌న్నారు. జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాల వేసే టైం కూడా కేసీఆర్‌కు లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని మండిప‌డ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీ దళితులను మోసం చేసిందని, కాంగ్రెస్‌ పార్టీ దళితులను సీఎం చేసిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క దుయ్య‌బ‌ట్టారు.


మ‌రోవైపు విద్యార్థులు సైతం త‌మ ఆగ్ర‌హాన్ని వెల్ల‌గ‌క్కుతున్నారు. ఉద్యోగాల విష‌యంలో కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం మండిప‌డ్డారు. విద్యార్థులు నెత్తుటి విత్తనాలు చల్లితే ఏర్పడిన తెలంగాణ ఫలాలను కేసీఆర్‌ కుటుంబం తింటోందని తెలంగాణ విద్యార్థి పొలిటికల్‌ జేఏసీ తీవ్రంగా ఆరోపించింది. కేసీఆర్‌ కుటుంబానికి నిరుద్యోగుల ఉసురు తగులుతుందని శపించింది. ఇది బంగారు తెలంగాణ కాదని, రోల్డ్‌గోల్డ్‌ తెలంగాణ అని ధ్వజమెత్తింది. కోదండరామ్‌ మౌనంగా ఉండడం సరికాదని, త్వరలో అన్ని వర్సిటీల విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని జేఏసీ హెచ్చరించింది. ఉద్యోగుల విభ‌జ‌న‌తో లంకె పెట్టి నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌డంలో జాప్యం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు.