Begin typing your search above and press return to search.

వెల్‌ కం అన్నంత‌నే రేవంత్ రియాక్ష‌న్ ఇది!

By:  Tupaki Desk   |   27 Oct 2017 5:37 AM GMT
వెల్‌ కం అన్నంత‌నే రేవంత్ రియాక్ష‌న్ ఇది!
X
తెలంగాణ టీడీపీలో హాట్ టాపిక్ గా మారిన రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆస‌క్తిక‌ర ఉదంతం ఇది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో ర‌హ‌స్యంగా భేటీ అయిన విష‌యం బ‌య‌ట‌కు రావ‌టం.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ తీర్థం తీసుకునేందుకు రంగం సిద్ధం కావ‌టం తెలిసిందే. పార్టీ మారే విష‌యం మీద రేవంత్ ఇప్ప‌టికి క్లారిటీ ఇవ్వ‌కున్నా.. ఆయ‌న పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు.

పార్టీ అధినేత‌ను క‌లిసి తాను పార్టీ వీడ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించి.. కాంగ్రెస్ లో చేర‌తార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. గురువారం ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన టీడీఎల్పీ స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు రేవంత్ వ‌చ్చారు.

ఆయ‌న్ను చూసినంత‌నే తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ష‌బ్బీర్ అలీ.. పొంగులేటి సుధాక‌ర్‌.. సంప‌త్ కుమార్ లు ఎదురుప‌డ్డారు. వెంట‌నే.. వెల్ కం.. వెల్ కం అంటూ న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. దీనికి పాజిటివ్ గా స్పందించిన రేవంత్‌.. వెంట‌నే వారికి ఆత్మీయ ఆలింగ‌నం చేసుకొని స్వాగ‌తించారు. వారికి క‌ర‌చాల‌నం చేసిన రేవంత్ ఆ త‌ర్వాత టీడీఎల్పీ స‌మావేశానికి వెళ్లారు.

ఢిల్లీలో రాహుల్ తో భేటీ అయిన నేప‌థ్యంలో టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రేవంత్ ను ఆ ప‌ద‌వుల నుంచి తొల‌గిస్తున్న‌ట్లుగా టీడీపీ ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. టీడీఎల్పీ స‌మావేశానికి హాజ‌రైన రేవంత్.. ఎప్ప‌టి మాదిరి తాను కూర్చునే కుర్చీలో కాకుండా ఎమ్మెల్యేలు కూర్చునే కుర్చీలో కూర్చున్నారు. ఈ రోజు పార్టీ అధినేత చంద్ర‌బాబును క‌లిసి.. తాను ఏ ప‌రిస్థితుల్లో రాహుల్ తో భేటీ అయ్యాన‌న్న విష‌యాన్ని వెల్ల‌డిస్తార‌ని చెబుతున్నారు. అయితే.. బాబుతో భేటీకి రేవంత్‌ కు అపాయింట్ మెంట్ దొర‌క‌ద‌ని.. ఆయ‌న్ను పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డిన‌ట్లుగా ఆరోపిస్తూ పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తార‌ని చెబుతున్నారు. ఏమైనా.. రేవంత్ రెడ్డి కండువా క‌ల‌ర్ మారే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.