Begin typing your search above and press return to search.
బీజేపీ తో 'ఫేస్ బుక్' కుమ్మక్కు ... ఫేస్ బుక్ సీఈవోకి కాంగ్రెస్ లేఖ !
By: Tupaki Desk | 29 Aug 2020 5:30 PM GMTప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ఫేస్ బుక్ ఇండియా విభాగం అధికార బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని వస్తున్న విమర్శలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ఆ లేఖలో మార్క్ జుకర్ బర్గ్ ను ప్రశ్నించింది. నెల రోజుల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఫేస్ బుక్ యాజమాన్యానికి లేఖ రాయడం ఇది రెండోసారి. బీజేపీ, ఫేస్ బుక్ ఇండియా విభాగం మధ్య క్విడ్ ప్రో కో నెలకొందని, పక్షపాత ధోరణులు కూడా కనిపిస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ మీడియాలో ప్రచురితమైన ఓ కథనాన్ని చూపిస్తూ విమర్శల దాడి చేస్తోంది.
ఓ విదేశీ సంస్థ దేశంలో సామాజిక సమగ్రతకు భంగం కలిగించడాన్ని సహించలేమని, దీనిపై చట్టపరమైన, న్యాయపరమైన చర్యల దిశగా ఆలోచిస్తున్నామని కూడా ఆ లేఖలో స్పష్టం చేశారు. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ లో ఇదే అంశంపై స్పందించారు. అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ వాట్సాప్, బీజేపీ లోపాయికారీ ఒప్పందాన్ని బట్టబయలు చేసిందని తెలిపారు. వాట్సాప్ ను 40 కోట్ల మంది భారతీయులు ఉపయోగిస్తున్నారు, వాట్సాప్ పేమెంట్స్ సేవలు కూడా అందించాలనుకుంటోంది. అందుకు మోదీ ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఆ విధంగా బీజేపీ వాట్సాప్ పై పట్టు సాధించింది అంటూ ఆరోపించారు. వాట్సాప్ మాతృసంస్థ ఫేస్ బుక్ అన్న విషయం తెలిసిందే. అందుకే కాంగ్రెస్ పార్టీ నేరుగా ఫేస్ బుక్ యాజమాన్యాన్నే ప్రశ్నిస్తోంది.