Begin typing your search above and press return to search.

గుజరాత్ లో బీజేపీ వ్యూహాం.. కాంగ్రెస్ కు చేజారిన సీటు

By:  Tupaki Desk   |   16 March 2020 6:30 AM GMT
గుజరాత్ లో బీజేపీ వ్యూహాం.. కాంగ్రెస్ కు చేజారిన సీటు
X
దేశమంతా కరోనా వైరస్ పాకి ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతుంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఫిరాయింపుల వైరస్ అంటుకుంది. ఆ వైరస్ ప్రభావం తో కాంగ్రెస్ తీవ్ర నష్టపోతుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినాయకత్వం చేతగానితనం స్పష్టంగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లో దాదాపు ప్రభుత్వం కోల్పోయే స్థితికి చేరిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే రాజ్యసభ స్థానం కోసం బీజేపీ వేసిన వ్యూహానికి కాంగ్రెస్ కు మరోషాక్ తగిలింది. గుజరాత్ రాష్ట్రంలో ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు బై బై చెప్పేశారు. తమ పదవులకు రాజీనామా చేయడం ఆ వెంటనే స్పీకర్ ఆమోదించడం జరిగిపోయాయి. దీంతో కాంగ్రెస్ కు రావాల్సిన ఒక రాజ్యసభ సీటు చేజారిపోయింది.

ఈనెల 26వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమం లో గుజరాత్ లో ఉన్న బలం తో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఒక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన జిగ్నేష్ మేవానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడం తో పాటు ఇద్దర్ని పోటీలోకి దింపింది. 182 మంది ఉన్న గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 73 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ రెండు రాజ్యసభ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు తెలపడం తో కాంగ్రెస్ ఆ స్థానాలు దక్కే అవకాశం ఉన్న తరుణం లో ఒక్కసారిగా బీజేపీ రాజకీయం చేసింది. బీజేపీ ఆదేశాల తో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా చేయడం తో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. వారు వెంటనే తమ ఎమ్మెల్యేల పదవికి రాజీనామా చేశారు. వాటిని స్పీకర్‌ రాజేంద్ర త్రివేది ఆమోదించారు. దీంతో కాంగ్రెస్ బలం 68కి పడిపోయింది. ఇప్పుడు బలం లేకపోవడం తో కేవలం ఒక రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ కు లభిస్తుండగా బీజేపీ రాజకీయం చేసి ఆ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది.

అయితే మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు భావించి కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని క్యాంపులకు తరలించింది. 14 మంది ఎమ్మెల్యేలను మొదటి బ్యాచ్ గా జైపూర్ కి తరలించగా, మరో 20-22 మంది ఎమ్మెల్యేలను మరో గ్రూపుగా జైపూర్ కి పంపించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది తో రాజీనామా అస్త్రం ప్రయోగిస్తే బీజేపీ 103 స్థానాలు ఉండడం తో గుజరాత్ లో మొత్తంగా మూడు రాజ్యసభ స్థానాలు సొంతం చేసుకోనుంది. దీంతో రాజకీయాలు రసకందాయంగా మారింది. ఇంకా ఏం పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి.

గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు
బీజేపీకి 103 మంది
కాంగ్రెస్ 73 మంది
ఐదుగురి రాజీనామానా తో కాంగ్రెస్ బలం 68కి పడిపోయింది.