Begin typing your search above and press return to search.
ప్రతిపక్షానికి వ్రతం చెడ్డా..ఫలితం దక్కలేదు
By: Tupaki Desk | 23 March 2018 6:20 PM GMTవ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న రీతిలో...కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఎత్తులు వేసి..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓటమిని రుచి చూపించాలని ప్రయత్నిస్తే..అది వారికే బెడిసి కొట్టిందంటున్నారు. ఏ అస్త్రంతో అయితే...గులాబీ దళపతిని దెబ్బ కొట్టాలని చూశారో...అదే అస్త్రం కేసీఆర్ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలపై ప్రదర్శించి వారికి షాకిచ్చారని చెప్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తే..అదే అంశంతో స్వతంత్ర ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న దొంతి మాధవరెడ్డి ఓటును అనర్హత వేయించారు.
రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఏజెంట్‌కు చూపించి మాధవరెడ్డి ఓటు వేశారు. అయితే...ఆయన ఓటుపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో.. నిబంధనల ప్రకారం ఆయన ఓటును ఎన్నికల అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఓట్లు మరిన్ని తగ్గిపోయి ఆయనకు 10 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సున్నం రాజయ్య, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాజాసింగ్, రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్ ఓటింగ్‌లో పాల్గొనలేదు.
కాగా, రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. రాష్ట్రంలో జరిగిన మూడు రాజ్యసభ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య, బండ ప్రకాశ్ విజయం సాధించారు.