Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ః కాంగ్రెస్ ఎల్పీ టీఆర్ఎస్ లో విలీనం
By: Tupaki Desk | 21 Dec 2018 2:44 PM GMTఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమై, మొత్తం శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు చేసిన ప్రకటన ఆమోదం పొందింది. టీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనం చేస్తూ శాసనమండలి బులిటెన్ విడుదల చేసింది. విలీన నిర్ణయాన్ని శాసనమండలి సెక్రటరీ ప్రకటించారు.
మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ ను కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్- కూసుకుంట దామోదర్ రెడ్డి- సంతోష్ కుమార్- ఆకుల లలితలు లేఖ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో కాంగ్రెస్ శాసనమండలి పక్షం విలీన చేయాలని కోరారు. అనంతరం మండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖ ను స్వామిగౌడ్ కు అందచేశారు. తమ శాసనసభాపక్షంలో విలీనం చేయాలని కోరారు. అనంతరం ఈ ప్రక్రియకు మండలి చైర్మన్ ఆమోదముద్ర వేశారు. ఇక నుంచి ఆకుల లలిత- సంతోశ్ కుమార్- ప్రభాకర్ రావు- దామోదర్ రెడ్డి లు టీఆర్‌ఎస్ ఎల్పీ సభ్యులుగా కొనసాగనున్నారు.
ఇదిలా ఉండగా, తాజా పరిణామంతో కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో షబ్బీర్ ఆలీ- పొంగులేటి సుధాకర్ రెడ్డి సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిద్దిరీ పదవీకాలం మార్చి ఆఖరితో ముగియనుంది. వారి పదీవీకాలం ముగిశాక మండలిలో కాంగ్రెస్ కు ప్రాతినిథ్యం లేకుండా పోయే పరిస్థితి ఉంది.