Begin typing your search above and press return to search.
ఆయనే కాంగ్రెస్ ను లీడ్ చేయనున్నారా?
By: Tupaki Desk | 28 May 2019 6:38 AM GMTసార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రజాతీర్పు.. అంచనాలకు భిన్నంగా ఏకపక్షంగా రావటమే కాదు.. మోడీ పవర్ కు తిరుగులేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. తాజాగా విడుదలైన ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి తాను రిజైన్ చేసినట్లుగా రాహుల్ గాంధీ చెప్పేయటం తెలిసిందే.
రాహుల్ ను బుజ్జగించటానికి కాంగ్రెస్ సీనియర్లు తెగ ట్రై చేస్తున్నా ఎలాంటి ఫలితం రాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసేందుకు సరైన నేత ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. 2014లో జరిగిన ఎన్నికల అనంతరం.. కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతగా మల్లికార్జున ఖర్గే వ్యవహరించారు. కాకుంటే.. ఈసారి ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో.. కొత్త నేతను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే రాహుల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని హోదాలో ఉండటం.. రాజ్యసభలో గులాం నబీ అజాద్ నేతగా సాగుతున్న వేళ.. లోక్ సభలో పార్టీని లీడ్ చేసేందుకు దక్షిణాదికిచెందిన నేత ఒకరికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదిలా ఉంటే.. తాను ఆ పదవిని చేపట్టేందుకుసిద్ధంగా ఉన్నట్లుగా సీనియర్ నేత.. మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఐక్యరాజ్యసమితిలో పని చేసిన శశిథరూర్.. తర్వాతి కాలంలో భారత రాజకీయాల్లోకి వచ్చారు. రచయితగా.. మేధావి వర్గంగా ఆయనకు పేరుంది. కాకుంటే ఆయన వ్యక్తిగత జీవితంపై పలు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన సతీమణి సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి విషయంలో శశిథరూర్ మీద వేలెత్తి చూపించే వారున్నారు. ఇది.. కాంగ్రెస్ కు కొంత ఇబ్బంది కలిగించే అంశంగా ఉంది. అయితే.. అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న మాట శశిథరూర్ నోట వస్తోంది.
తనకు లోక్ సభలో పార్టీని లీడ్ చేసే అవకాశం ఇస్తే.. తాను సిద్ధంగా ఉన్నట్లుగా ఆయన చెబుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఎంపీగా గెలుపొందిన ఆయన.. తాజా ఎన్నికల్లోనూ విజయం సాధించారు. మూడుసార్లు ఎంపీగా గెలవటం అంటే.. ఆయనకు అంతో ఇంతో ప్రజాభిమానం ఉన్నట్లేనని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ నుంచి లోగుట్టుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని.. అందుకే ఆయన అంత ఉత్సాహంగా ముందుకు వచ్చినట్లుగా భావిస్తున్నారు. మరి.. కాంగ్రెస్ అధికారికంగా ఈ అంశంపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.