Begin typing your search above and press return to search.
షర్మిల కేసీఆర్ వదిలిన బాణమేనట? ఆధారాలివే?
By: Tupaki Desk | 4 Dec 2022 11:38 AM GMTతెలంగాణ రాజకీయాల్లో వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడు దూకుడుగా ముందుకెళుతున్నారు. ఆమె పాదయాత్రను అడ్డుకోవడంతో ఏకంగా ప్రగతిభవన్ ముట్టడికే ఆమె బయలుదేరారు. ఆ క్రమంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. టీఆర్ఎస్ నేతలు తనకు ఎన్ని అవాంతరాలు కల్పించాలని చూసినా పాదయాత్ర కొనసాగించి తీరుతోంది. డిసెంబర్ 14వ తేదీన తన పాదయాత్ర ముగుస్తుందని షర్మిల చెబుతోంది.
అయితే తాజాగా షర్మిల మాటల్లో నిజం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. షర్మిల కేసీఆర్ వదిలిన బాణం అని అంటున్నారు. జగ్గారెడ్డి అన్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనమయ్యాయి.
షర్మిల బీజేపీ వదిలిన బాణం అని ఇటు టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే కల్వకుంట్ల కవిత ఇదే వాదన మొదలుపెట్టారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇందుకు విరుద్ధంగా వైసీపీకి, టీఆర్ఎస్ కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని అంటున్నారు. దీంతో షర్మిల ఇంతకీ ఎవరు వదిలిన బాణం అన్నది తెలియకుండా ఉంది.
కేసీఆర్ పై ఈగ వాలనివ్వని టీఆర్ఎస్ నేతలు షర్మిలపై మాత్రం అరకొర విమర్శలు చేస్తూ మౌనం దాలుస్తున్నారు. కేసీఆర్ చెప్పడంతోనే వారు మౌనంగా ఉన్నారని.. సరైన సమయం రాగానే షర్మిలను టార్గెట్ చేసేలా కేసీఆర్ వ్యూహం రచించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇన్నాళ్లు షర్మిలపై విమర్శలు వద్దని కేసీఆర్ ఆదేశించారని.. అందుకే టీఆర్ఎస్ నేతలు షర్మిలపై పల్లెత్తు మాటలు మాట్లాడలేదనే టాక్ ఉంది.
అయితే వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ నేతలను షర్మిల తిట్టడం.. తట్టుకోలేక ఆమె కాన్వాయ్ లోని క్యార్ వాన్ కు వాళ్లు నిప్పుపెట్టడం.. కారు అద్దాలు ధ్వంసం చేయడం.. ఆమె సమైక్యవాది అంటూ ఆంధ్ర ముద్ర వేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తెలంగాణలో బీజేపీ బలపడడం.. ఢిల్లీ లిక్కర్ స్కాం.. వంటి వ్యవహారాలు పక్కదారి పట్టేలాగానే షర్మిలను టీఆర్ఎస్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. షర్మిలను రెచ్చగొట్టి బీజేపీకి క్రేజ్ రాకుండా చేయడం ఇందులో భాగమంటున్నారు. షర్మిలను ఆంధ్రా అని మళ్లీ లోకల్-నాన్ లోకల్ సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా చెబుతున్నారు. కేసీఆర్ వదిలిన బాణమే షర్మిల అని అంటున్నారు.