Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
By: Tupaki Desk | 4 Feb 2021 4:16 PM GMTతెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో సీఎం మార్పు ఊహాగానాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా కేటీఆర్ కన్నా ఈటల రాజేందర్ బెటర్ అని.. ఈటెలను సీఎం చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
'కేటీఆర్ సమర్థుడే కావచ్చు.. కానీ కేటీఆర్ పై విమర్శలు వస్తాయి.. అదే ఈటలపై అయితే రావు.. అతడు సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తి' అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈటల రాజేందర్ కు సీఎం అవకాశం ఇస్తే మంచిదన్నారు. మంత్రి ఈటలపై ప్రశంసలు కురిపించారు జీవన్ రెడ్డి.
పసుపు బోర్డు ఏర్పాటుకు, పసుపు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు జీవన్ రెడ్డి లేఖ రాశారు. క్వింటాల్ పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేదని.. ఇప్పుడు తులం బంగారం రూ.50వేలకు పెరిగిందని.. పసుపు ధర మాత్రం రూ.6 వేలకు పడిపోయిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరిగేదని అన్నారు.
పసుపు బోర్డు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేదని జీవన్ రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. పసుపు బోర్డు 100 రోజుల్లో ఏర్పాటు చేయకుంటా రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిన బీజేపీ ఎంపీ అరవింద్ ఇప్పుడు స్పందించం లేదని ప్రశ్నించారు. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయవచ్చని గుర్తు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో పసుపు రూ.7 వేలకు క్వింటాలు కొనేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.కేంద్రం.. రాష్ట్రం ఒకరిపై ఒకరు నెపం మోపుతున్నారని మండిపడ్డారు. రైతుల పక్షాన మాట్లాడుతున్న ఏకైక మంత్రి ఈటల అని.. రైతుల ఆందోళనకు మద్దతు ఇవ్వడంపై జీవన్ రెడ్డి అభినందించారు.