Begin typing your search above and press return to search.

టీ పాలిటిక్స్‌ లో సూప‌ర్ ట్విస్ట్‌...!

By:  Tupaki Desk   |   17 Sep 2019 11:27 AM GMT
టీ పాలిటిక్స్‌ లో సూప‌ర్ ట్విస్ట్‌...!
X
తెలంగాణ రాజ‌కీయాల్లో రోజుకో కొత్త మ‌లుపులు తిరుగుతున్నాయి. తెలంగాణ రాజ‌కీయాల‌కే రోజుకో ట్విస్ట్‌ లు ఇస్తూ రాజ‌కీయాల‌ను ర‌స‌వ‌త్త‌రంగా మార్చి మ‌జా చేస్తున్నాడు మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌ రెడ్డి. అస‌లు కోమ‌టిరెడ్డి రోజురోజు ఇస్తున్న ట్విస్ట్‌ ల‌తో రాజ‌కీయ ప‌రిశీల‌కుల‌కే త‌ల‌బొప్పి క‌డుతోంది. ఇంత ర‌స‌వ‌త్త‌ర‌మైన రాజ‌కీయం మ‌నం ఏనాడు చూసిన దాఖాలాలు లేవంటే అతిశ‌యోక్తి కాదు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌ రెడ్డి ట్విస్ట్‌ ల‌ను ఓసారి ప‌రిశీలిస్తే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క‌మాన‌దు. ఇప్పుడు రాజ‌గోపాల్ రెడ్డి టీ మంత్రి టి. హ‌రీష్‌ రావుతో భేటి అయ్యి మ‌రో ట్విస్ట్ ఇచ్చాడు..

న‌ల్ల‌గొండ జిల్లాలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ కు కాంగ్రెస్‌ లో ఎదురే లేదు. కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌ రెడ్డి - కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌ రెడ్డిలు ఇద్ద‌రు కాంగ్రెస్ రాజ‌కీయాల‌కు పెట్ట‌ని కోట‌గా ఉన్నారు. అయితే గ‌తంలో త‌మ్ముడు పార్ల‌మెంట్ మెంబ‌ర్‌ గా గెలిస్తే అన్న అసెంబ్లీకి గెలించిండు. త‌మ్ముడు ఓడిపోయినా అన్న మాత్రం అసెంబ్లీకి గెలిచాడు. త‌మ్ముడు వెంట‌నే ఎమ్మెల్సీగా గెలిచి స‌త్తా చాటాడు. ఇక మొన్న‌టి ఎన్నిక‌ల్లో అన్న‌దమ్ములు ఇద్ద‌రు అసెంబ్లీకి పోటీ చేస్తే త‌మ్ముడు గెలిచిండు.. అన్న ఓడిండు. దీంతో అన్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పోటీ చేసి బంప‌ర్ మెజారిటీతో గెలిచిండు.

ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓడిపోయి అధికారం ద‌క్క‌క‌పోవ‌డం - పీసీసీ ప‌ద‌వి త‌న అన్న‌కు ఇవ్వ‌కపోవ‌డంతో మ‌న‌స్థాపం చెందిన రాజ‌గోపాల్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వాన్ని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టి ప్ర‌త్య‌ర్థి పార్టీ అయిన బీజేపీని ఆకాశ‌నికెత్తాడు. కాంగ్రెస్ క‌థ ముగిసిన చ‌రిత్ర అన్న కోమ‌టిరెడ్డి బీజేపీ తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తుంద‌ని అని పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అంతే కాదు తాను బీజేపీలో చేరుతున్నాన‌ని ప్ర‌క‌టించాడు. అయితే త‌మ్ముడు బీజేపీకి పోతాన‌ని అన్నాకూడా అన్న మాత్రం కాంగ్రెస్‌లోనే ఉన్నాడు. ఇక ఏమైందో ఏమో నిన్న రాజ‌గోపాల్‌ రెడ్డి యూ ట‌ర్న్ తీసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యే గురించి పంచ‌పాండ‌వుల క‌థ చెప్పిండు.. ఏకంగా త‌న‌ను తాను అర్జునుడు అంటూ అభివ‌ర్ణించుకుని తాను కాంగ్రెస్‌ లోనే ఉంటాన‌ని మ‌రో ట్విస్ట్ ఇచ్చాడు.

ఇంత‌లో ఏమైందో ఏమో పంచ‌పాండవుల క‌థ చెప్పి ఒక్క‌రోజు కూడా కాక‌ముందే.. ఇప్పుడు తెలంగాణ ఆర్థిక మంత్రి హ‌రీష్‌ రావుతో భేటీ అయ్యాడు. ఇప్పుడు హ‌రీష్‌ రావుతో ఎందుకు భేటీ అయ్యిండో ఇదేమి ట్విస్టో ఎవ్వ‌రికి అంతు చిక్క‌కుండా ఉంది. అన్న కాంగ్రెస్‌ లోనే కొన‌సాగుతున్నా.. త‌మ్ముడు మాత్రం అన్ని పార్టీల నేత‌ల‌ను క‌లిసి ట్విస్ట్‌ ల మీద ట్విస్ట్‌లు ఇస్తూ అంద‌రికి షాక్ ఇస్తుంది. హ‌రీష్‌ రావుతో భేటి ఇప్పుడు రాజ‌కీయ ప్రాధాన్యత సంత‌రించుకుంది. అంటే హ‌రీష్‌రావుతో భేటీ ద్వారా రాజ‌గోపాల్‌ రెడ్డి ఎలాంటి ట్విస్ట్ ఇవ్వ‌నున్నాడో అంతు చిక్క‌డం లేదు.. అటు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరుతాన‌ని ప్ర‌క‌టించి - త‌రువాత మ‌న‌సు మార్చుకుని మ‌ళ్ళీ సొంత‌గూటిలోనే ఉంటాన‌ని, ఇప్పుడు టీఆర్ ఎస్ నేత‌తో క‌లువ‌డంతో గులాబీ గూటికి చేరుతాడా ? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.