Begin typing your search above and press return to search.
ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉందన్న భట్టికి స్పీకర్ ఏం చెప్పారు?
By: Tupaki Desk | 18 March 2021 10:30 AM GMTతెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో వివిధ పార్టీల నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వటం మామూలే. కరోనా కారణంగా సభలోని వారంతా ముఖానికి మాస్కు పెట్టుకోవటం తప్పనిసరి కావటం తెలిసిందే. దీంతో.. మాస్కు కష్టాలు అందరికి ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ముఖానికి మాస్కు పెట్టుకోవటం అలవాటు లేని వారికి.. దాన్ని పెట్టుకోవటం ఒక కష్టమైతే.. మాస్కు పెట్టుకొని మాట్లాడటం మరింత కష్టమైన పనిగా చెప్పాలి.
ఇలాంటి ఇబ్బందే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత భట్టికి ఎదురైంది. దీంతో ఆయన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో.. ‘ అధ్యక్షా.. మాస్క్ తీయొచ్చా? ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. దీనికి స్పీకర్ నుంచి ఊహించని సమాధానం వచ్చింది. మాస్క్ తీయండి.. ఫర్లేదు.. కానీ మీకిచ్చే టైం లోపల ముగించండి అంటూ పేర్కొన్నారు.
దీంతో.. భట్టి స్పందిస్తూ.. సీఎంగారు ఎంతసేపైనా మాట్లాడొచ్చు.. మాకేమో మైక్ కట్ చేస్తారంటూ నిష్ఠూరాలు ఆడటం మొదలు పెట్టారు. సాధారణంగా అధికారపక్షానికి అసెంబ్లీలో ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉండటం.. విపక్షాలకు తక్కువ సమయం ఇవ్వటం మామూలే. ప్రతి సమావేశంలోనూ ఈ అంశంపై తరచూ వాదన జరగటం.. విపక్షాల మాటను అధికారపక్షం పట్టించుకోకపోవటం తెలిసిందే.