Begin typing your search above and press return to search.
ఆ ఎమ్మెల్యే పెద్దదొంగ
By: Tupaki Desk | 14 April 2015 10:51 AM GMTఆమె ఓ ఎమ్మెల్యే... ప్రజలకు జవాబుదారీగా, ఆదర్శంగా ఉండడం మాట అటుంచండి.. కనీసం సాధారణ మనిషిలా అయినా ప్రవర్తించాలి. కానీ... ఆమె మాత్రం జనం నవ్వుకునేలా, ఆమెను చూసి అసహ్యించుకునే పని చేసింది. కార్ల దొంగతనం కేసులో దొరికిపోయింది. ఇంతకీ ఆమె ఏ పార్టీ ఎమ్మెల్యేయో తెలుసా.....? కాంగ్రెస్.. దేశాన్ని చాలాకాలం ఏలిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆమె.
అస్సాంలో రూమీనాథ్ అనే మహిళా ఎమ్మెల్యే కార్ల దొంగతనం కేసులో బుక్కయింది. కార్ల దొంగతనాలలో కీలక సూత్రధారితో సంబందాలు ఉన్నాయన్న అబియోగంతో ఆమెను అరెస్టు చేశారు. అస్సాంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల్లో చాలామందిపై రకరకాల ఆరోపణలున్నాయి. తాజాగా రూమీనాథ్ అంతకుమించిన ఆరోపణలతో అరెస్టవడంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అనిల్ చౌహాన్ అంతర్రాష్ట్ర కార్ల దొంగకు పెద్ద ముఠా ఉంది. ఖరీదైన కార్లను అపహరించి, తప్పుడు పత్రాలు సృష్టించి తిరిగి అమ్మడం అనిల్ పని. అస్సాంకు చెందిన ఒక మంత్రి కూడా ఆయన వద్ద కారు కొన్నాడట. అనిల్ తో రూమీకి, ఆమె భర్త జాకీర్, సెక్యూరిటీ అధికారికి మంచి సంబంధాలు ఉన్నాయట. అనిల్ అస్సాం అసెంబ్లీలోకి వచ్చేందుకు రూమీ పలుమార్లు సెక్యూరిటీ పాస్ లు ఏర్పాటు చేయించారట.
అసోం, డిల్లీ,మహారాష్ట్ర తదితర చోట్ల అనిల్ గాంగ్ పై పదుల సంఖ్యలో కార్ల దొంగతనం కేసులున్నాయి. చౌహాన్ పోలీసులకు దొరకడంతో ఎమ్మెల్యేగారి కథ కూడా బయటకొచ్చింది. రూమీ హైకోర్టులో బెయిల్ కోసం పయ్రత్నించినా దొరక్కపోవడంతో అరెస్టు కాక తప్పలేదు. పాపం ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది.