Begin typing your search above and press return to search.

పుట్ట మ‌ధు మెడ‌కు మ‌రో ఉచ్చు: సీబీఐ, ఈడీల‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు

By:  Tupaki Desk   |   11 May 2021 1:30 AM GMT
పుట్ట మ‌ధు మెడ‌కు మ‌రో ఉచ్చు:  సీబీఐ, ఈడీల‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు
X
పుట్ట మ‌ధు! కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా వినిపిస్తున్న పేరు. కొన్నాళ్ల కింద‌ట‌.. న‌డిరోడ్డుపై లాయ‌ర్ దంప‌తులు.. గ‌ట్టు వామ‌న‌రావు, నాగ‌మ‌ణిల‌ను హ‌త్య చేసిన కేసులో పుట్ట మ‌ధు పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ కుచెందిన నాయ‌కుడిగా, మాజీ ఎమ్మెల్యేగా, పెద్ద‌ప‌ల్లి జ‌డ్పీ చైర్మ‌న్‌గా పేరు తెచ్చుకున్న మ‌ధును రామ‌గుండం పోలీసులు.. ఏపీలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెల‌సిందే. అయితే.. ఇప్పుడు పుట్ట మ‌ధుకు మ‌రో ఉచ్చు బిగుసుకోనుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

సీబీఐ, ఈడీల‌కు.. ఇనుముల ఫిర్యాదు

పుట్ట మధు అక్రమాలు చేసి వందల కోట్ల ఆస్తులు సంపాదించారని మంథినికి చెందిన‌ కాంగ్రెస్ నేత ఇనుముల సతీశ్ ఇప్పుడు పెద్ద బాంబే పేల్చారు. ఏకంగా ఆయ‌న సీబీఐ, ఈడీల‌కు పుట్టాపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ప‌లు ఆస్తుల వివ‌రాల‌ను.. పుట్టా వాటిని ఎలా సంపాయించారో కూడా వివ‌రిస్తూ.. ఫిర్యాదు చేయ‌డం, పుట్ట మధు అక్రమంగా ఆస్తులు 900 కోట్లపైనే కూడ బెట్టినట్లు ఆరోపించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇవీ.. ఆరోప‌ణ‌లు..

+ జూబ్లీహిల్స్ లో దివంగ‌త సినీ హీరో శ్రీహరి ఇంటి పక్కన 5 కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది.

+ పుట్టా లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారు.

+ అరబ్ ఎమిరేట్స్,దుబాయిలలో అనేక వ్యాపారాల్లో 100 కోట్ల పెట్టుబడులు

+ ముంబైలో అదిరాజ్ కన్ స్ట్రక్షన్స్ పేరుతో 50 కోట్లు పెట్టుబడి

+ భువనగిరిలో 140 ఎకరాలలో భవిత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పుట్టా మధు భార్య డైరెక్టర్

+ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పుట్ట మధు భాగస్వామ్యంగా మహా రాష్ట్ర‌లో మెడికల్ కాలేజి ఏర్పాటుకు 100 కోట్లతో భూములు కొన్నారు.

+ మంథిని మండలం వెంకటపూర్ లో 120 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌస్)

+ ఇందులో కొంత భాగం ఎస్సిలకు కేటాయించిన అసైన్డ్ భూములు

+ మంథిని పట్టణంలో మెయిన్ రోడ్ లో ఎలాంటి అనుమతులు లేకుండా 2 కోట్లు తో ఇంటి నిర్మాణం

+ ముగ్గురు మేనల్లుళ్ల‌కు ఒక్కొక్కరికి 50 లక్షలతో ఇంటి నిర్మాణాలు.

+ మంథిని మండలం విలోచవరం మరియు ఉప్పట్లలో కోట్ల రూపాయలు విలువ చేసే వ్యవసాయ భూములు.

+ రామాచూర్ లో స్నేహితుడు మద్దిపాటి శ్రీనివాసరావు అలియాస్ గుంటూరు శ్రీను తో కోట్ల రూపాయల భాగస్వామ్యంతో వ్యాపారాలు.

+ ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో మాజీ మంత్రి ఈటల, పుట్ట మధు కొందరు నేత‌ల‌తో కలిసి 80 ఎకరాల భూమి కొనుగోళ్ళు

+ మంథిని నియోజకవర్గ వ్యాప్తంగా పలుచోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా బినామీ పేర్లతో ఇసుక దందా

+ మధు సోదరుడు పుట్ట సత్యనారాయణ తో కోట్లాది రూపాయల పెట్టుబడితో ట్రాన్స్ పోర్ట్ వ్యాపారాలు

+ పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై నిర్మిస్తున్న 12 చెక్ డ్యాంలలో ఇరిగేషన్ అధికారుల అండదండలతో 40 కోట్ల అవకతవకలు.

+ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల కాంట్రాక్ట్ సిండికెట్లు ఏర్పాటు చేసి కమిషన్లు వసూలు