Begin typing your search above and press return to search.
తెలంగాణలో అంపశయ్య పై కాంగ్రెస్
By: Tupaki Desk | 17 Jun 2019 11:14 AM GMTతెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు అంపశయ్యపై ఉంది. ఓ వైపు కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ తో ఆపార్టీని కబళించడానికి రెడీ అయ్యారు. మరోవైపు అధికార యావతో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇప్పటికే సీఎల్పీని విలీనం చేశారు కేసీఆర్. ఇక మిగిలిన ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడడం ఖాయంగానే కనిపిస్తోంది..
మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ 19 స్థానాలను మాత్రమే చేజిక్కించుకుంది. అందులో 13మంది కారెక్కగా.. మిగిలిన 6 ఆరుగురు ఇప్పుడు మిగిలారు. ఇందులో తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై నిప్పులు చెరిగి ఇక ఆ పార్టీ పని అయిపోయిందని విమర్శిస్తూ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక తనతోపాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డిని తీసుకుపోతున్నారు.
ఇక వీరిద్దరూ పోగా భద్రాచలం నుంచి కాంగ్రెస్ తరుఫున గెలిచిన పోడెం వీరయ్య కూడా పార్టీ మారేందుకు డిసైడ్ అయ్యారు. ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఈ ముగ్గురు కాంగ్రెస్ ను వీడితే ఇక మిగిలేది ముగ్గురే.. మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఉన్నారు. ఇక డి. శ్రీధర్ బాబు, సీతక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇక ఇటీవలే గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిలు బీజేపీలో చేరడానికి రెడీ అయ్యారని వార్తలు వచ్చాయి. ఇక కోమటిరెడ్డి బ్రదర్ రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ ఘోర ఓటమితో ఆ పార్టీని పట్టించుకునే నాథుడే లేడని .. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ బలపడే అవకాశాలు లేవని నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారు. అందుకే వరుసగా నేతలు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ తెలంగాణలో మనుగడ కష్టమేనంటున్నారు. కాంగ్రెస్ స్థానంలో బీజేపీ బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ ను బతికించడం అంత ఈజీ కాదంటున్నారు.