Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు మిత్రపక్షాలు దూరమవుతాయా..?
By: Tupaki Desk | 10 Aug 2018 2:30 PM GMTరాజ్యసభ ఉపాధ్యక్ష పదవి ఎన్నిక కాంగ్రెస్ దాని మిత్రపక్షాల మధ్య వైరం తేనుందా. ఈ ఎన్నికలో రాహుల్ గాంధీ వ్యవహరించిన ఒంటేత్తు పోకడ మిత్రపక్షాలను దూరం చేయనుందా. అవుననే అంటున్నారు పరిశీలకులు. ఉపాధ్యక్ష పదవికి సంబంధించి ఎవరితోను సంప్రదించకపోవడం కనీసం పార్టీలోని సీనియర్లతో కూడా చర్చించకపోవడం రాహుల్ గాందీ తప్పిదంగా చెబుతున్నారు. లోక్ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కౌగిలించుకుని ఏవత్ దేశం తనవైపు చూసేల చేసుకున్న రాహుల్ గాంధీ రాజకీయంగా వేస్తున్న పాచికలు - ఎత్తుగడలు ఫలించటంలేదు. రాజకీయ వ్యూహ రచనలో దిట్టలైన ప్రధాని నరేంద్ర మోదీ - అమిత్ షాలను ఎదుర్కోవడంలో రాహుల్ గాంధీ తత్తరపడుతున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ అనుభవంలేని ఆయన సీనియర్లతో సలహాలు - సంప్రదింపులూ కూడా చేయడంలేదంటున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న తరుణంలో వ్యూహ ప్రతి వ్యూహాలు రచించడంలో ఎప్పటికప్పుడు మార్పులూ - చేర్పులూ చేయాలి.
ఏ రాజకీయ నాయకుడైన తన వ్యూహలను రచిస్తే సరిపోదు. ఎదుటి వారి వ్యూహాలను కూడా ఓ కంట కనిపెట్టాలి. వాటిపై అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాలి. రాహుల్ గాంధీకి కాని సోనియా గాంధీకి కాని రాజకీయంగా అంతటి అవగాహన లేదు. పార్టీలో గులాంనబి ఆజాద్ - జైరామ్ రమేష్ ఇంకా పలువురు సీనియర్లు ఉన్నా, వారిని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు రాహుల్ గాంధీ. కర్ణటక ఉదాంతం తర్వాత రాహుల్ గాంధీలో పరిణితి వచ్చిందని అందరూ భావించారు. అయితే అది స్దానిక కాంగ్రెస్ నాయకుల వ్యూహమే తప్ప రాహుల్ గాంధీ చొరవ ఏమి లేదని ఇప్పుడు అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికలలో తమతో కలసి పోటి చేద్దమనుకుంటున్న పార్టీలు రాహుల్ గాంధీ ప్రవర్తనతో మనసు మార్చుకునే అవకాశం ఉందంటున్నారు. రాహాల్ లో రాజకీయ చతురత - పరిణితి - పరిస్థితులను అంచనా వేసి దానికి అనుగుణంగా వ్యవహరించే తీరు తెలియకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర సమితీ - అన్నాడిఎంకే వంటి పార్టీలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక ఉత్తరాదిలో బీజేపీకి ఉన్న బలం తెలియంది కాదు. ఈ పరిస్థితులలో రాహుల్ గాంధీ సీనియర్ల సలహాలు - సంప్రదింపులతో వ్యవహరించకపోతే అధికారంలోకి రావడం అసాధ్యమే...!!