Begin typing your search above and press return to search.
వరంగల్ లో మురిసిపోతున్న విపక్ష పార్టీలు!
By: Tupaki Desk | 10 Nov 2015 3:57 AM GMTఎక్కడో కూడా ఏదో జరిగితే.. ఇక్కడకూడా అదే రిపీటవుద్దా? అవుతుందనేది ఇక్కడ వరంగల్ ఎన్నికల బరిలో ఆత్మ వంచన చేసుకుంటున్న విపక్షా పార్టీల ధోరణిగా కనిపిస్తోంది. బీహార్ లో ఎన్నికల ఫలితాల తర్వాత.. ఆ ఫలితాలకు మసిపూసి మారేడు కాయ చేసి.. తమ దైన వక్రభాష్యాలను జత చేసి.. 'అక్కడ అలా భాజపా ఓడిపోయింది గనుక.. ఇక్కడ అధికార తెరాస కూడా ఓడిపోతుందని' అంటూ తమని తాము మోసం చేసుకుంటూ.. వరంగల్ ఎన్నికల బరిలో ముమ్మరంగా తిరుగుతున్న కాంగ్రెస్ - భాజపా లు మురిసిపోతూ ఉన్నాయి.
బీహార్ లో భాజపా ఓడిపోయింది గనుక.. వరంగల్ లో తెరాస కూడా ఓడిపోతుందని విపక్ష పార్టీలు విడివిడిగా మురిసిపోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఎవరికి తోచిన రీతిగా వారు లింకులు పెట్టుకుని.. వ్యాఖ్యానాలు చేసుకోవడమే జరుగుతూ ఉంటుంది గనుక.. భాజపా ఓటమిని.. ఇక్కడ ఎవరికి తోచినట్లు వాళ్లు వర్ణిస్తున్నారు. ఆ క్రమంలో ఆత్మ వంచన చేసుకుంటున్నారు.
నిజానికి వారు గుర్తించినప్పటికీ.. గుర్తించనట్టుగా నటిస్తున్న సత్యం మరొకటి ఉంది. భాజపా విషయానికి వస్తే- మోడీ సర్కారుకు వ్యతిరేకంగా బీహార్ లో ఓటింగ్ జరిగిన తరహాలోనే.. వరంగల్ లో కూడా మోడీ వ్యతిరేకత మాత్రమే ఉంటుందని.. గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఓట్లకంటె తమ పార్టీ పరిస్థితి నీచంగా తయారవుతుందని, ఓట్లు తగ్గుతాయని వారెందుకు భయపడడం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. బీహార్ లో మాదిరిగానే ఇక్కడ కూడా తమ బలం పెరుగుతుందని వారు అంటున్నారు. అది ఎలాసాధ్యం? బీహార్ లో వారి బలం పెరగడానికి.. ఆ పార్టీకి పెరిగిన ఆదరణ కారణం అనుకుంటే అది ఆత్మవంచన. అక్కడ ప్రజాబలం ఉన్న నితీశ్-లాలూ కూటమిలో భాగస్వామిగా ఉండడం ద్వారా మాత్రమే.. కాంగ్రెస్ పార్టీ ఆ మాత్రం సీట్లను సాధించింది. ఇక్కడ వరంగల్ లో ఆ విధంగా తాము వేరే వాళ్ల భుజాల మీద ఎక్కి సవారీ చేయడానికి వీల్లేదని వారెందుకు గుర్తించడం లేదో తెలియదు.
అదే సమయంలో.. అందరూ మోడీకి వ్యతిరేకంగా ఓటు పడిందని అంటున్నారే తప్ప.. రాష్ట్ర సర్కారు నితీశ్ కుమార్ ఏలుబడికి అనుకూలంగా పడిన ఓటు ఇది.. అని ఎందుకు గుర్తించడం లేదు. కనీసం ఈ విపక్ష పార్టీలు ఆ వాస్తవాన్ని అంగీకరించగలిగితే.. ఇక్కడ వరంగల్ లో కూడా.. తెరాస రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలమైన ఓటు పడవచ్చుననే ఆలోచన వారికి కలుగుతుంది.