Begin typing your search above and press return to search.
తమిళనాడు.. కాంగ్రెస్ కూటమికి తేలికేమీ కాదు!
By: Tupaki Desk | 18 April 2019 4:31 AM GMTసాధారణంగా ఐదేళ్లకు ఒక సారి ప్రభుత్వాన్ని మార్చేయడం తమిళులకు అలవాటు. అయితే ఆ అలవాటు మూడేళ్ల కిందట జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో తప్పింది. నాటి ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అనుకుంటే, అనూహ్యంగా జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.
అలా ముఖ్యమంత్రి అయిన కొంత కాలానికే ఆమె మరణించారు. ఆ తర్వాత అన్నాడీఎంకే చుక్కాని లేని నావలా సాగుతూ ఉంది. జయలలిత అనంతరం చెలరేగిన ఆధిపత్య పోరులో అన్నాడీఎంకే వాళ్లు మరీ పలుచన అయిపోయారు. శశికళ జైలు శిక్షను అనుభవిస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో పన్నీరు- పళనిల ఆధ్వర్యంలోని అన్నాడీఎంకేను ఓడించి డీఎంకే- కాంగ్రెస్ లు తమిళనాట జెండా పాతడం ఏ మాత్రం కష్టం కాకపోవచ్చు అనేది ప్రముఖంగా వినిపించే విశ్లేషణ.
ఇన్నాళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, జయలలిత లేని లోటు, డీఎంకేకు దక్కే ఛాన్స్.. ఇవన్నీ కూడా డీఎంకే- కాంగ్రెస్ కూటమికి ప్లస్ పాయింట్లే.
అయితే నేడు జరుగుతున్న పోలింగ్ మాత్రం పూర్తిగా ఏకపక్షంగా లేదని టాక్. కాస్త అటూ ఇటూగా ఉందని, డీఎంకే – కాంగ్రెస్ లు మరీ స్వీప్ చేసే అవకాశాలు లేవని అంటున్నారు.
లోక్ సభ కు ఐదేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే స్వీప్ చేసింది. ఏకంగా ముప్పై ఏడు సీట్లను నెగ్గింది. కేవలం రెండు సీట్లను మాత్రం ఆ పార్టీ వదిలింది. అవి కూడా డీఎంకేకు దక్కలేదు. పీఎంకేకు ఒకటి - బీజేపీకి మరోటి దక్కింది.
ఈ సారి అన్నాడీఎంకే - పీఎంకే - విజయ్ కాంత్ పార్టీ - బీజేపీలు కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. అటు వైపు కాంగ్రెస్ - డీఎంకే - వైగో పార్టీలు కలిసి రంగంలోకి దిగాయి. ఇలాంటి నేపథ్యంలో పోరు హోరాహోరీగానే కనిపిస్తూ ఉంది. డీఎంకే కు కాస్త ఎడ్జ్ ఉండొచ్చు కానీ, అలాగని స్వీప్ చేసే అవకాశాలు మాత్రం కనపడటం లేదనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.
కమల్ హాసన్ పార్టీ - దినకరన్ పార్టీలు కూడా ఈ ఎన్నికల పోరులో ఉన్నాయి. మరి వాటి ప్రభావం ఎంతో చూడాల్సి ఉంది.