Begin typing your search above and press return to search.
'కర్ణాటకం' లో4-1తో కాంగ్రెస్-జేడీఎస్ గెలుపు!
By: Tupaki Desk | 6 Nov 2018 7:02 AM GMTమరి కొద్ది నెలల్లో జరగబోతోన్న సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీకి గట్టి షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న ఊహాగానాలు నిజమయ్యాయి. కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జేడీయూ కూటమి ....జయకేతనం ఎగురవేసింది. కర్ణాటకలోని మూడు లోక్ సభ స్థానాలకు - రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ కూటమి 4 స్థానాలను కైవసం చేసుకుంది. ఒకే ఒక్క లోక్ సభ స్థానంతో బీజేపీ సరిపెట్టుకుంది. ఆ 5 స్థానాల్లో గత శనివారం జరిగిన ఉపఎన్నికల ఫలితాలు నేడు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ సర్కార్ కు చెంపపెట్టు వంటివని కాంగ్రెస్ - జేడీయూ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ పతనానికి ఈ ఫలితాలు నాంది పలుకుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీకి పెట్టని కోట వంటి బళ్లారి పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ బద్దలు కొట్టింది. 2004 నుంచి బళ్లారి పార్లమెంట్ స్థానాన్ని శాసిస్తున్న బీజేపీకి ఈసారి మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. బళ్లారి పార్లమెంట్ స్థానం నుంచి గాలి జనార్థనరెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీరాములు సోదరి వి.శాంతపై కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్ప విజయం సాధించారు. దీంతో - గాలి జనార్థన్ - బీజేపీలకు షాక్ తగిలింది. మండ్య లోక్ సభ స్థానాన్ని జేడీఎస్ కైవసం చేసుకుంది. మరో లోక్ సభ నియోజకవర్గం శివమొగ్గలో బీజేపీ అభ్యర్థి - మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర తన సమీప జేడీఎస్ అభ్యర్థి మధు బంగారప్పపై విజయం సాధించారు. ఇక, రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి - ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనిత కుమారస్వామి గెలుపొందారు. మరో అసెంబ్లీ నియోజకవర్గం జమఖండీలో కాంగ్రెస్ అభ్యర్థి - మాజీ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ కుమారుడు ఆనంద్ విజయం సాధించారు.