Begin typing your search above and press return to search.
పొత్తుతో గిడ్డి ఈశ్వరీ ఖేల్ ఖతమేనా.?
By: Tupaki Desk | 5 Nov 2018 5:30 PM GMTసీట్ల తకరారు తేలక తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ అభ్యర్థులు తల పట్టుకుంటున్నారు. ఎక్కడ ఎవరికి సీటు ప్రకటిస్తే ఏ అసమ్మతి వస్తుందోనని భయపడుతున్నారు. కాంగ్రెస్ - టీడీపీ స్నేహహస్తం అధినేతలకు లాభంగానే కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కొందరి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థంగా మారుతోంది.
తెలంగాణలో జతకట్టిన కాంగ్రెస్-టీడీపీలు ఏపీలోనూ కలిసి సాగేందుకు నిర్ణయించాయట.. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్ నేతలకు లాభమే కానీ.. ఎటువంటి నష్టం లేదు. కానీ కాంగ్రెస్ తో పొత్తు వల్ల తమ ఆశలు గల్లంతవుతాయనే ఆందోళన టీడీపీ సిట్టింగ్ లు - పలువురు ఆశావహుల్లో మొదలైంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన విశాఖ జిల్లా అధ్యక్షుడు - మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు - పీసీసీ కార్యదర్శి ద్రోణం రాజు శ్రీనివాస్ లు గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిపోయారు. ఈసారి కాంగ్రెస్ -టీడీపీ పోటీలో బాలరాజు పాడేరు - శ్రీనివాస్ విశాఖ దక్షిణం పై కన్నేశారు. కానీ ఇప్పటికే విశాఖ దక్షిణంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ పొత్తుల్లో తన సీటుకు ఎసరు వస్తుందని కంగారుగా ఉన్నారట.. ఈ స్థానంలో శ్రీనివాస్ 2014 కు ముందు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు భయం పట్టుకుందట.. కాంగ్రెస్ తో పొత్తుతో ఎమ్మెల్యే వాసుపల్లి పోస్టుకు ఎసరు వచ్చేలానే కనిపిస్తోంది.
ఇక పాడేరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కోసం టీడీపీలో చేరిన గిడ్డీ ఈశ్వరి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ మారితే పదవులు ఇస్తానన్న బాబు హామీ నెరవేరలేదు. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు వల్ల పాడేరులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి మణికుమారి బలంగా ఉన్నారు. ఆమెను కాదని గిడ్డికి టికెట్ ఇస్తారా లేదా అన్న టెన్షన్ ఆమెలో మొదలైందట.. బాబు రాజకీయాల కోసం త్యాగం చేయాలన్న మాటను విని గిడ్డి ఈశ్వరీ ఆందోళనగా ఉన్నారట.. మాజీ మంత్రి బాలరాజు కూడా పాడేరుపై కన్నేయడంతో ఈ సీటు కాంగ్రెస్ కు వదిలేయాలని దాదాపు టీడీపీ డిసైడ్ అయినట్టు వార్తలొస్తున్నాయి. అదే జరిగితే ఎన్నో ఆశలతో పార్టీ మారిన గిడ్డి ఈశ్వరీ రాజకీయ భవిష్యత్ కనుమరుగవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక గతంలో కేంద్రమంత్రులుగా పనిచేసిన రాజ్యసభ ఎంపీలు టి. సుబ్బిరామిరెడ్డి - కిశోర్ చంద్రదేవ్ లు ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు. వారు గెలిచిన విశాఖ - అరకు ఎంపీ సీట్లను ఈసారి కాంగ్రెస్ కు వదిలేస్తే అక్కడ ఆశావహుల ఆశలు గల్లంతైనట్టే.. అయితే అరకు లో టీడీపీకి బలమైన నేత లేకపోవడంతో ఆ సీటు ఇచ్చి విశాఖ సీటును ఇచ్చే అవకాశాలు లేవని.. ఒకే జిల్లాలో రెండు సీట్లు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు.