Begin typing your search above and press return to search.
బీజేపీని ఓడించి గెలుస్తామంటున్నారు!
By: Tupaki Desk | 22 Oct 2019 12:33 PM GMTమహరాష్ట్ర - హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే పోలింగ్ ముగిసింది. ఆ ఎన్నికల్లో హాట్ ఫేవరెట్ భారతీయ జనతా పార్టీనే అని అంటున్నాయి ఎగ్జిట్ పోల్ అంచనాలు. బంపర్ మెజారిటీలతో ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి విజయం దక్కే అవకాశం ఉందని సర్వేలు అంచనా వేస్తూ ఉన్నాయి.
మహారాష్ట్రలో శివసేనతో కలిసి బీజేపీ సంపూర్ణ మెజారిటీని సాధిస్తుందని - హర్యానాలో బీజేపీ ఒంటి చేత్తో కాంగ్రెస్ ను చిత్తు చేస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతూ ఉన్నాయి.అయితే ఇలాంటి ప్రచారం నేపథ్యంలో కూడా ఒక వ్యక్తి మాత్రం బీజేపీ ఓడిపోతుందని గట్టిగా చెబుతున్నారు. ఆయనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్. మహారాష్ట్రలో అధికారం తమదే అని పవార్ గట్టిగా చెబుతూ ఉన్నారు. తామే అధికారంలోకి వస్తామని ఆయన చెప్పుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా మహారాష్ట్రలో విజయం పట్ల అంత ధీమాతో లేరు. వారు ఎక్కడా విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేయడం లేదు. అయితే పవార్ మాత్రం మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి ఓటమి తప్పదని - అధికారం తమదే అని ప్రకటించుకుంటున్నారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ - ఎన్సీపీలు కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయం పట్ల పవార్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు కథ ఎలా ఉండబోతోందో.. ఈ నెల ఇరవై నాలుగున తెలుస్తుంది!