Begin typing your search above and press return to search.
‘స్థానిక’ ఉప ఎన్నికల్లో గులాబీకి షాకులు
By: Tupaki Desk | 10 Dec 2015 5:39 AM GMTపంచాయితీ.. మున్సిపల్..కార్పరేషన్ స్థాయిలో జరిగే ఎన్నికలు కొన్నింటిలో తెలంగాణ అధికారపక్షానికి షాకులు తగులుతున్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన పలు స్థానిక ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అదే సమయంలో తెలంగాణలో తమ పట్టు చేజారుతుందన్న భయంలో ఉన్న కాంగ్రెస్ కు భరోసానిస్తూ.. ఫలితాలు రావటం ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు.
తాజాగా కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో డివిజన్ కు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ అధికారపక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవానికి ఈ స్థానం టీఆర్ ఎస్ దే. అయితే.. దీనికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి సావిత్రి.. తన సమీప టీఆర్ ఎస్ అభ్యర్థి స్నేహపై 167 ఓట్లతో విజయం సాధించటం విశేషం.
తీవ్ర నిరాశ.. నిస్పృహల్లో కూరుకుపోతున్న కాంగ్రెస్ పార్టీకి ఊరటనిస్తూ.. స్థానిక సంస్థలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్ని చేజిక్కించుకోవటం ఆ పార్టీకి ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు సాయం చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.