Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు భారీ షాకిచ్చిన ఆ ముగ్గురు!

By:  Tupaki Desk   |   1 April 2019 5:55 AM GMT
కాంగ్రెస్ కు భారీ షాకిచ్చిన ఆ ముగ్గురు!
X
కొండ నాలుక్కి మందే ఉన్న నాలుక పోయిన సామెతను కాంగ్రెస్ నేత‌లు ప‌దే ప‌దే గుర్తు తెచ్చుకుంటూ రోదిస్తున్న ప‌రిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ‌ల‌మైన పార్టీగా ఒకప్పుడు వెలుగు వెలిగిన కాంగ్రెస్‌.. ఈ రోజున రెండు రాష్ట్రాల్లో ఆస్తిత్వం కోసం పోరాడాల్సి రావటాన్ని ఆ పార్టీ నేతలు అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు.. రాజ‌కీయంగా పెద్ద ఎత్తున ప్ర‌యోజ‌నాలు వ‌చ్చి ప‌డ‌తాయ‌న్న అంచ‌నాకు భిన్నంగా.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బ‌తికించుకోవ‌టానికి ప‌డుతున్న తిప్ప‌లు అన్ని ఇన్ని కావు.

గ‌డిచిన కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ అధికార‌ప‌క్షం తీరుతో.. ఆ పార్టీ ఖాళీ అవుతున్న ప‌రిస్థితి. మూడున్న‌ర నెల‌ల క్రితం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి గెలిచిన ప‌లువురు ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవ‌టం తెలిసిందే. ఇది స‌రిపోద‌న్న‌ట్లుగా తెలంగాణ‌ కాంగ్రెస్ నేత‌ల్ని టార్గెట్ చేస్తున్న వైనం ఇప్పుడా పార్టీకి షాకింగ్ గా మారింది.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు నేత‌లు టీఆర్ ఎస్‌.. బీజేపీలోకి జాయిన్ కావ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఇటీవ‌ల ఎమ్మెల్సీ ప‌ద‌వీ కాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి బీజేపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌ట‌మే కాదు.. ఢిల్లీలో పార్టీ అధినేత అమిత్ షా స‌మ‌క్షంలో గులాబీ కండువాను క‌ప్పుకున్నారు.

మ‌రోవైపు కొద్ది రోజులుగా పార్టీ మార‌తార‌న్న ప్ర‌చారం జోరుగా వినిపిస్తున్న మాజీ మంత్రి సునీతా ల‌క్ష్మారెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. తాజాగా ఆమె టీఆర్ ఎస్ పార్టీలో చేరనున్న విష‌యాన్ని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవ‌టం బాధ‌గా ఉంద‌ని.. పార్టీలో కొంద‌రు త‌న గౌర‌వానికి భంగం క‌లిగేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని.. స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌కుండా నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని చెప్పారు. ఈ కార‌ణాల‌తోనే తాను పార్టీని వీడి.. గులాబీ కారు ఎక్క‌నున్న విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఇక‌.. మాజీ మంత్రి.. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన విజ‌య‌రామారావు సైతం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ.. తాజాగా జ‌రుగుతున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ త‌న‌కు టికెట్ ఇచ్చేందుకు నో చెప్పిన పార్టీ తీరును ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తీరుకు నిర‌స‌న‌గానే తాను పార్టీకి రాజీనామా చేసిన‌ట్లుగా వెల్ల‌డించారు. పారాచూట్ అభ్య‌ర్థుల‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్ర‌మాదం తెచ్చిన‌ట్లుగా ఆయ‌న మండిప‌డ్డారు. ఇలా ముగ్గురు నేత‌లు.. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేస్తూ వెల్ల‌డించిన వైనం ఆ పార్టీకి మ‌రింత ఇబ్బందుల్లోకి ప‌డేసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి అయ్యే నాటికి తెలంగాణ కాంగ్రెస్ ను ఖాళీ చేయ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న గులాబీ బాస్.. త‌న‌ టార్గెట్ కు ద‌గ్గ‌ర‌వుతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.