Begin typing your search above and press return to search.
రేవంత్ ను అడ్డంగా బుక్ చేసిన కాంగ్రెస్?
By: Tupaki Desk | 29 Oct 2017 6:24 AM GMTతెలుగుదేశం పార్టీకి రేవంత్ గుడ్ బై చెప్పటం పాత ముచ్చట. కాంగ్రెస్ లో చేరనున్నాడన్నది చిన్నపిల్లాడికి తెలిసిన విషయమే. అయితే.. ఈ రెండింటికి మధ్య బయటకు రానిది మరొకటి జరిగిందట. ఆ విషయం రేవంత్ కు.. కాంగ్రెస్ కు చెందిన కొద్దిమంది నేతలకు మాత్రమే తెలుసన్నది తాజా సమాచారం. కాంగ్రెస్‌లోకి వెళ్లాలన్నది ఫైర్ బ్రాండ్ రేవంత్ నిర్ణయమే అయినప్పటికీ.. వాస్తవానికి ఆయన ఆలోచన వేరట.
టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరాలని భావించిన రేవంత్.. అందుకు వేసుకున్న ప్లాన్ ఒకటైతే.. జరిగింది మరొకటి కావటం విశేషం. ఎవరికి తెలీకుండా.. గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన రేవంత్.. తాను పార్టీలో చేరాలంటే తనకేం కావాలన్న అంశానికి సంబంధించిన డిమాండ్లు కొన్ని పెట్టారట.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ లాంటోడు తెలంగాణ కాంగ్రెస్‌కు చాలా అవసరం. అలా అని.. రేవంత్ డిమాండ్లను తీరిస్తే వచ్చే తలనొప్పులు కాంగ్రెస్ అధినాయకత్వానికి బాగా తెలుసు.
అందుకే.. రేవంత్ కోర్కెల్ని తీర్చకుండా.. ఆయన్ను అడ్డంగా బుక్ చేసేసిన వైనం చూస్తే ఆసక్తికరమని చెప్పాలి. కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకున్న రేవంత్.. అందుకు ఈ డిసెంబరు సరైన ముహుర్తంగా భావించారట. డిమాండ్లను కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర పెట్టి.. వాటికి ఓకే అంటే డిసెంబరులో పార్టీలో చేరటానికి తాను సిద్ధమని చెప్పారట.
రేవంత్ మాటలకు మొదట కాంగ్రెస్ ఓకే అన్నా.. తర్వాత ఆలోచనలో పడిందట. రేవంత్ డిమాండ్లకు ఓకే అనకపోతే ఆయన పార్టీలో చేరే అవకాశం లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యుడు చెప్పిన మాట కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఆలోచనల్లో పడేసిందట.
వెంటనే పావులు కదిపిన కాంగ్రెస్.. రేవంత్ లాంటి ఫైర్ బ్రాండ్ వదులుకోకూడదని డిసైడ్ అయ్యింది. అలా అని డిమాండ్లను తీర్చే పరిస్థితులు లేని నేపథ్యంలో కాంగ్రెస్ మార్క్ రాజకీయాన్ని తెర మీదకు తెచ్చింది. ఢిల్లీలో సీక్రెట్ గా తమను కలుస్తున్న రేవంత్ గురించి తనదైన రీతిలో మీడియాకు.. కొందరు నేతలకు రివీల్ చేశారట. గుట్టుచప్పుడు లేకుండా దేశ రాజధానికి వెళ్లి వద్దామనుకున్న రేవంత్ కు దిమ్మ తిరిగిపోయేలా టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ లు.. కొందరు టీడీపీ నేతల నోటి నుంచి రేవంత్ ను టార్గెట్ చేయటంతో అనుకున్న దాని కంటే ముందే పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందట. అలా.. రేవంత్ కోరిన డిమాండ్లను తీర్చకుండానే తమ పార్టీలో చేర్చుకోవటంలో కాంగ్రెస్ తాను అనుకున్నది సాధించినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్సా.. మజాకానా?