Begin typing your search above and press return to search.
తిట్టించుకోవడానికి ఢిల్లీ వెళ్లారు
By: Tupaki Desk | 14 Dec 2015 8:34 AM GMTతెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ నేతలకు కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దారీతెన్నూ లేకుండా సాగుతున్నా కూడా అధిష్ఠానం చూసీ చూడనట్లుగానే ఉంటోంది. అసలే బలహీనంగా ఉన్న పార్టీ శ్రేణులు అక్కడి బలమైన పాలక పక్షాలను ఎదుర్కోవాలంటే కొంత సమయం పడుతుందని... వారిని ప్రోత్సహించాలే తప్ప కొరడా విదిలించరాదని అధిష్ఠానం అనుకుంటోంది. కానీ, ఆ విధానమే తెలంగాణలో కొంప ముంచడంతో ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటోంది. టీ కాంగ్రెస్ నేతలకు తలంటడానికి అధిష్ఠానం వారిని ఢిల్లీకి పిలిచింది.
తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉండగా ఏకంగా ఆరు స్థానాలను టీఆరెస్ ఏకగ్రీవంగా ఎగరేసుకుపోయింది. పోటీ ఉన్న మిగతా స్థానాల్లోనూ అన్నీ ఆ పార్టీయే గెలుచుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏకగ్రీవమైన చోట్ల ఏకంగా అభ్యర్థులే నేరుగా టీఆరెస్ తో ఒప్పందాలు కుదుర్చుకుని పోటీ నుంచి విరమించుకున్నారు. కాంగ్రెస్ నుంచి టిక్కెట్లు పొందిన అభ్యర్థులు ఇలా విత్ డ్రా కావడంపై అధిష్ఠానం చాలా సీరియస్ గా ఉంది. ఇది నాయకుల వైఫల్యంగానే ఫుల్లుగా క్లాసు పీకేందుకు వారిని ఢిల్లీ రమ్మని పిలిచింది. దీంతో సోమవారం కొందరు నేతలు ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - సీఎల్ పీ నేత జానారెడ్డి - వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క - మాజీ మంత్రులు దానం నాగేందర్ - సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పార్టీ అధిష్ఠానంతో భేటీ కానున్నారు.
కాగా చాలాకాలంగా జానారెడ్డి వ్యవహారంపై అధిష్ఠానానికి ఫిర్యాదులు అందుతుండడంతో ఆయనకు ప్రత్యేక కోటింగు ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో పెద్ద మనిషి లెక్క ఆయన వ్యవహరిస్తూ ఒక్కోసారి మెప్పుకోసం సొంత పార్టీని కాదని టీఆరెస్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ అలుసుగా తీసుకుని టీఆరెస్ సామదానభేదదండోపాయాలను తెలివిగా ప్రయోగిస్తూ రాజకీయాలు చేసి లాభ పడుతోంది. ఈ సంగతి తెలుసుకున్న అధిష్ఠానం జానాకు స్పెషల్ క్లాస్ తీసుకోనుందని సమాచారం.