Begin typing your search above and press return to search.
టీ పీసీసీ చీఫ్ మార్పు ప్రక్రియ వాయిదా వేసిన కాంగ్రెస్..ఎందుకంటే !
By: Tupaki Desk | 20 Dec 2019 12:00 PM GMTతెలంగాణ కాంగ్రెస్ లో త్వరలోనే భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి అని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. చాలాకాలం నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలోనే ఆ పదవికి గుడ్ బై చెబుతారని... త్వరలోనే తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ కారణంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంతకాలంగా పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడం లేదని అంతా అనుకున్నారు.
అయితే ఆయన మరోసారి టీపీసీసీ చీఫ్ హోదాలో పార్టీ సమావేశం ఏర్పాటు చేయడంతో మరికొంతకాలం ఉత్తమ్ తెలంగాణ కాంగ్రెస్ బాస్ గా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే టీ పీసీసీ చీఫ్ మార్పు అంశాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం మరికొంతకాలం వాయిదా వేయడం వెనుక అసలు కారణం వేరే ఉందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పీసీసీ చీఫ్ మార్పు నిర్ణయం సరికాదని కొందరు నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల కొత్తగా వచ్చే పీసీసీ అధ్యక్షుడు ఎన్నికలపై దృష్టి పెట్టడం కష్టమవుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఉత్తమ్ సారథ్యంలోనే మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్. ఆ ఎన్నికలు పూర్తయిన తరువాత టీ పీసీసీకి కొత్త చీఫ్ ను ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.