Begin typing your search above and press return to search.
డిగ్గీరాజాకు తోక కత్తిరించేస్తున్నారోచ్!
By: Tupaki Desk | 13 Sep 2015 3:02 PM GMTఅవతలి వాళ్ల ఎమోషన్స్ ఎలా గాయపడుతున్నాయనే ఆలోచన ఎంతమాత్రమూ లేకుండా.. తనకు తోచినట్లుగా తాను మాట్లాడేస్తూ.. చెలరేగిపోతూ ఉండే కాంగ్రెసు నాయకుడు దిగ్విజయసింగ్. ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సలహా - కీలక కూటమిలో ఒకరుగా మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాలకు పార్టీ ఇన్చార్జిగా - రాష్ట్ర విభజన సమయంలో అత్యంత కీలకభూమిక పోషించిన శకుని పాత్రధారిగా వార్తల్లో ప్రముఖ వ్యక్తిగా ఒక వెలుగు వెలిగారు. ఆ మాత్రం కీర్తి ప్రతిష్టలు మీడియా ఫోకస్ తనకు చాలదన్నట్లుగా.. ఇంచుమించు తనకు కూతురి వయసు ఉండే ఒక మీడియా రిపోర్టర్ తో సుదీర్ఘకాలం ప్రేమాయణం నడిపి - లివింగ్ టుగెదర్ కాపురం సాగించి - ప్రేమిస్తే తప్పేంటి అంటూ అడిగిన వారిని నిలదీసి - చివరికి పెళ్లికూడా చేసుకుని.. 68 ఏళ్ల వయసులో 'అవును పెళ్లి చేసుకున్నా' అంటూ గర్వంగా చెప్పుకోవడం ద్వారా మరింత (అప)కీర్తిని మూటగట్టుకున్న నాయకుడు ఆయన! అలాంటి డిగ్గీరాజాకు పార్టీలో ఉన్న అధికారాలను అధిష్ఠానం కత్తిరించడానికి ప్రిపేర్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తన కూతురి కంటె తక్కువ వయసు ఉండగల అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత.. డిగ్గీరాజా ఒక శస్త్ర చికిత్స కోసం (ఏ సమస్య నివారణ కోసమో?) ప్రస్తుతం అమెరికా వెళ్లి ఉన్నారు. అక్కడినుంచి ఆయన తిరిగివచ్చాక.. తన జరిగిపోయిన పెళ్లి గురించి చాలా ఘనంగా వెల్లడిస్తా అంటూ డిగ్గీ సెలవిచ్చారు.
అయితే ఆయన తిరిగివచ్చే సమయానికి పార్టీలో ఉన్న అధికారాలకు చెక్‌పెట్టి.. ఖాళీసమయం మొత్తం కొత్త సంసారంలో సరదాగా గడుపుకునేందుకు కోత విధించడానికి అధిష్ఠానం సిద్ధమవుతున్నదిట. ఈ కోత పెట్టే క్రతువులో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పెద్దలంతా కూడా తలో చెయ్యీ వేశారని సమాచారం. డిగ్గీ రాజా.. తెలుగురాష్ట్రాల ఇన్చార్జిగా ఆయన ఫెయిల్యూర్స్ ఎన్ని ఉన్నాయో.. ఆయన ఈ రాష్ట్రాల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి పార్టీ దారుణంగా నష్టపోవడానికి కారకులు అయ్యారో అన్ని సంగతులూ అధిష్ఠానానికి ముందే నివేదినంచారుట. సార్వత్రిక ఎన్నికల్లో తెరాసతో పొత్తు పెట్టుకుని లబ్ధి పొందడానికి వీల్లేకుండా, అసలు తెరాస విలీనం కాకుండా.. ఆయన వైఫల్యాలే కారణం అయ్యాయని మేడంకు నివేదించారుట. అసలే రాహుల్ పగ్గాలు చేపట్టాలనుకుంటున్న సమయంలో.. 65 దాటిన వృద్ధ నేతలందర్నీ సలహాలకు మాత్రమే పరిమితంచేసి.. కొత్తరక్తంతో టీం నింపాలని చాలాకాలంనుంచి అనుకుంటున్నారు. ఆప్రయత్నాల్లో భాగంగా.. డిగ్గీ పై ఎప్పుడో వేటు పడాల్సిందే గానీ.. ఆయన అమెరికానుంచి రాగానే ఆ లాంఛనం పూర్తవుతుందని చెబుతున్నారు. డిగ్గీరాజా కొత్తకాపురాన్ని ప్రశాంతంగా సాగించడానికి పార్టీ కార్యాలయంలో పనిఒత్తిడి మొత్తం తగ్గిపోబోతున్నది.
ఈసారి ఆయన సపత్నీకంగా హనీమూన్ కోసం అయినా హైదరాబాదు వస్తే గనుక.. మూడు రంగుల ఖద్దరు పూలమాలలు మూటగట్టించుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలికే నాయకులు ఉండకపోవచ్చు అని పలువురు జోకులేసుకుంటున్నారు.