Begin typing your search above and press return to search.
కడప కాంగ్రెస్.. టీడీపీ బాట పడుతుందా?
By: Tupaki Desk | 22 Oct 2021 4:30 PM GMTఅధికార పార్టీపై ఆశలు పెట్టుకున్న వారు.. అసంతృప్తి జ్వాలలు పెరుగుతున్నాయి. ఎక్కడికక్కడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సామాజిక వర్గాల వారీగా.. వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు ఏమీ లాభం లేదని ఆవేదన చెందుతూ.. ప్రత్యామ్నాయాలవైపు.. దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సొంత జిల్లా వైఎస్సార్ కడపలోనూ ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఇక్కడి రెడ్డి నాయకులు ఇప్పుడు ఆల్టర్నేట్ వైపు దృష్టి పెడుతుండడం.. రాజకీయాలను ఎటు మారుస్తుందో అనే చర్చకు దారితీసింది.
కడప జిల్లాకు వైఎస్సార్ కడప జిల్లా అని పేరుంది. దీనికి కారణం.. జిల్లా అంతా కూడా వైఎస్సార్ కనుసన్నల్లోనే ఉండేది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సో.. ఆయనపై ఉన్న మక్కువతో.. దీనిని వైఎస్సార్ కడపగా తర్వాత వచ్చిన ప్రభుత్వం పేరు పెట్టింది. ఆ తర్వాత.. ఇప్పుడు.. వైఎస్సార్ సీపీ అధీనంలో ఈ జిల్లాలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2014 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న మొత్తం 10 ఎమ్మెల్యే స్థానాల్లో 9 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఇక, 2019 ఎన్నికల్లో మొత్తం 10 కి 10 వైసీపీనే క్లీన్ స్వీప్ చేసింది.
దీనికి కారణం ఏంటంటే.. గతంలో వైఎస్సార్‌ను వ్యతిరేకించిన వాళ్లు కూడా.. 2019 ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం ఒకటయ్యారు. దీంతో ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. జగన్ మన రెడ్డి. సో.. ఆయన ముఖ్యమంత్రి అయితే.. మనకు ఏదైనా చేస్తారు.. మనకు రాజ్యాధికారం వస్తుంది.. అని తపించారు. ఈ క్రమంలోనే భారీ విజయం కట్టబెట్టారు. అయితే.. ఇప్పటికి జగన్ ముఖ్యమంత్రి అయిన రెండున్నరేళ్లు అయింది. అయినప్పటికీ.. కడప రెడ్లకు ఆయన ఏమీ చేయడం లేదనే వాదన వినిపిస్తోంది.
కనీసం వారి మాటను కూడా వినిపించుకునేందుకు తీరికలేకుండా పోయిందనే బాధ ఇక్కడివారిలో కనిపిస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇక్కడి రెడ్లు.. ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. కాంగ్రెస్‌లో ఒకప్పుడు ఒక వెలుగువెలిగిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు.. ఇలా అందరూ కూడా కాంగ్రెస్‌కు చెందిన వారే. వీరంతా గత ఎన్నికల్లో జగన్‌కు జై కొట్టారు. ఇప్పుడు వీరే.. యూటర్న్ తీసుకునేందుకు ఆలోచన చేస్తున్నారట. కేవలం వైసీపీని నమ్ముకున్న తమకు ఇబ్బందులు వస్తున్నాయని.. ఇదే కొనసాగితే.. రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు తప్పవని అనుకుంటున్నారట.
ఈ క్రమంలోనే వారు ప్రత్యామ్నాయం వైపు దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఈ క్రమంలో వారు టీడీపీ లేదా జనసేనల వైపు మొగ్గు చూపుతున్నారట. వీటిలోనూ.. జనసేనకు కేడర్ లేదు కాబట్టి.. మంచిదో చెడ్డదో.. నాయకులు తమ పిల్లల భవిష్యత్తు కోసం.. టీడీపీలో చేరితే.. మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీలోకి కడప నుంచే కాకుండా.. సీమ నుంచి పాత కాంగ్రెస్ నాయకులు చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోందని అంటున్నారు విశ్లేషకులు.
ఎందుకంటే.. ఎలాంటి అనుభవం లేని కొందరు పెత్తనం చెలాయిస్తున్నారని.. వారి కింద తాము ఎందుకు పనిచేయాలని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు రెడ్లకు అందడం లేదు. ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పని కూడా జరగడం లేదు. దీంతో వీరంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక, స్థానికంగా ప్రజలు ఎలా ఉన్నారు. వీరి అభిప్రాయం ఏంటనేది కూడా చూసుకుని.. తర్వాత.. జంప్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఇక, ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ దఫా విజయం పై నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన ఈ దఫా ప్రభుత్వం ఏర్పడితే.. మేం రెడ్లకు అన్యాయం చేయం .. అనే వాదనను బలంగా వినిపిస్తున్నారట. దీంతో రెడ్డి సామాజకి వర్గం ఆయనవైపు చూస్తోందని అంటున్నారు పరిశీలకులు. చూడాలి వైసీపీ నుంచి వీరు వేరు పడతారా? పార్టీ అధిష్టానం ఏఏమైనా చర్యలు తీసుకుంటుందా? రెడ్డి వర్గాన్ని పిలిచి మాట్లాడుతుందా? బుజ్జగిస్తుందా? అనేది చూడాలి అంటున్నారు పరిశీలకులు.
మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే.. కామెంట్స్ రూపంలో పెట్టండి.. మేం ప్రచురిస్తాం. మీకు నచ్చితే లైక్ కొట్టండి.. షేర్ చేయండి.